Original Tablets: మీరు వాడే ట్యాబ్లెట్స్‌ నిజమైనవా నకిలీవా.. ఇలా గుర్తించండి..!

Find Out If The Tablets You Are Using Are Genuine Or Fake Through This Method
x

Original Tablets: మీరు వాడే ట్యాబ్లెట్స్‌ నిజమైనవా నకిలీవా.. ఇలా గుర్తించండి..!

Highlights

Original Tablets: ఈ రోజుల్లో మనం వాడే చాలా ట్యాబ్లెట్లు, మెడిసిన్‌ నకిలీవని వార్తలు వస్తున్నాయి. మార్కెట్‌లో నకిలీ మందుల బిజినెస్‌ జోరుగా సాగుతోంది.

Original Tablets: ఈ రోజుల్లో మనం వాడే చాలా ట్యాబ్లెట్లు, మెడిసిన్‌ నకిలీవని వార్తలు వస్తున్నాయి. మార్కెట్‌లో నకిలీ మందుల బిజినెస్‌ జోరుగా సాగుతోంది. మనం తెలియకుండా వేలకొద్ది డబ్బులు పెట్టి నకిలీ మందులు కొని వ్యాధులు తగ్గక హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగు తున్నాం. నకిలీ మందుల ముప్పు ఆరోగ్యానికి, జీవితానికి పెను ముప్పుగా సంభవించింది. వీటిని అసలైన మందుల మాదిరి తయారుచేసి వినియోగదారులను మోసగిస్తున్నారు. మీరు కొనే మందులు, మెడిసిన్‌ నిజమైనదా, నకిలీదా ఎలా గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం.

నకిలీ మందుల వల్ల కలిగే నష్టమేంటి?

నకిలీ మందులు నాణ్యత లేని మందులు. ఔషధాల పరిమాణం అవసరమైన దానికంటే తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అస్సలే ఉండదు. సాధారణంగా ఇలాంటి మందులు వాడడం వల్ల రోగికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఎసిడిటీ, బీపీ, షుగర్‌కి సంబంధించిన మందులు నకిలీవని తెలుస్తుంది. సాధారణంగా నకిలీ మందులు మార్కెట్‌లో ఎక్కువగా వినియోగించే మందులే ఉంటాయి.

ఎలా గుర్తించాలి?

నకిలీ మందుల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా వాటిని డాక్టర్లకు చూపిస్తూ చెక్‌ చేస్తూ ఉండాలి. నిరంతరంగా మందులు వేసుకున్నా, రక్తపోటు తగ్గకపోయినా, ఉపశమనం లభించకపోయినా వెంటనే డాక్టర్‌ని కలిసి మందులు చూపించాలి. రక్తపోటును లేదా మధుమేహాన్ని చెక్‌ చేయడానికి గ్లూకోమీటర్ ఇంట్లో ఉంచాలి. జన్ ఔషధి కేంద్రం నుంచి లభించే జనరిక్ ఔషధాలు సాధారణంగా నమ్మదగినవి. ఇవి బ్రాండెడ్ మందుల ధరల కంటే తక్కువకు లభిస్తాయి.

ఇటీవల ప్రభుత్వం మందులపై క్యూఆర్ కోడ్ పెట్టే విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల మందుల సమాచారాన్ని పొందవచ్చు. ఆ ఔషధం తయారీ, గడువు తేదీ ఎంత, ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ, విక్రయిస్తున్న కంపెనీ, ఏ నగరం నుంచి ఔషధాన్ని తయారు చేసి పంపించారు తదితర విషయలు తెలిసిపోతుంది. అయితే ఈ విధానం ఎంపిక చేసిన మందులపై మాత్రమే ఉంది అన్నిటికి లేదు. మెడిసిన్‌లో ఇచ్చిన సమాచారం క్యూఆర్‌ కోడ్‌తో సరిపోలకపోతే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories