Fenugreek Seeds: మెంతి గింజలలో ఆయుర్వేద గుణాలు అధికం.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యవౌషధం..!

Fenugreek seeds are Rich in Ayurvedic Properties that act as a Panacea for these Health Problems
x

Fenugreek Seeds: మెంతి గింజలలో ఆయుర్వేద గుణాలు అధికం.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యవౌషధం..!

Highlights

Fenugreek Seeds: మెంతి గింజలలో ఆయుర్వేద గుణాలు అధికం.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యవౌషధం..!

Fenugreek Seeds: వంటగదిలో ఉండే మెంతుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యలని నయం చేస్తాయి. మెంతి గింజలలో ఆయుర్వేద గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. అంతేకాదు మెంతిగింజలు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇళ్లలో ఉండే కుండీలలో కూడా పెంచుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. మెంతి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మెంతులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య ఆగిపోతుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి మెంతి గింజలు ఉపయోగకరంగా ఉంటాయి. రాత్రంతా నీటిలో వేసి ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినాలి. అంతేకాకుండా ఆ నీటిని కూడా తాగాలి. దీనివల్ల రక్తంలో చక్కెర కంట్రోల్‌ అవుతుంది. కడుపునొప్పితో బాధపడుతుంటే రోజూ ఏదో ఒక రూపంలో మెంతిని వాడాలి తొందరగా తగ్గిపోతుంది.

మెంతి గింజలు లేదా మెంతి పొడిని ఉపయోగించడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి లేకుంటే మెంతిగింజల పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఆకలి వేస్తుంది. మెంతికూర కాలేయానికి చాలా ఉపయోగపడుతుంది. పరిశోధన ప్రకారం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు మెంతులులో కనిపిస్తాయి. మెంతి కూరలో యాంటీ హైపర్‌టెన్సివ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.మెంతి గింజలను నానబెట్టి దాని పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories