Health Tips : మీ పిల్లలు సన్నగా ఉన్నారా?బరువు పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించండి.!

/nps-vatsalya-is-new-nps-scheme-for-minors
x

 NPS Vatsalya: ఎన్‌పీఎస్‌ వాత్సల్య..పిల్లల భవిష్యత్ కు బంగారు బాట..ఈ స్కీమ్ పూర్తి వివరాలివే

Highlights

Health Tips : మీ పిల్లలు సన్నగా..పీలలా కనిపిస్తున్నారా?ఎంత తిన్నా బరువు పెరగడం లేదా?అయితే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించండి. ఆ ఫుడ్స్ ఏవో చూద్దామా మరి.

Health Tips :బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు తాగుతారు. వైద్యులు మాత్రం ఏడాది పాటు తల్లిపాలు ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. ఎందుకంటే తల్లిపాలలో ఉన్న పోషకాలు మరే పదార్థాల్లో లభించవు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలి. సాధారణంగా ఆరు నెలల తర్వాత బిడ్డకు నెమ్మదిగా ఘనరూపంలో ఉన్న ఆహారం ఇస్తుంటారు. ఉగ్గు లాంటి ఫుడ్ పెడుతుంటారు. తల్లి పాలు తాగినప్పుడు బిడ్డ బరువుగా బొద్దుగా ఉంటుంది. బిడ్డకు ఘనరూపంలో ఉన్న తినిపించడం ప్రారంభించిన తర్వాత క్రమంగా బరువు తగ్గుతుంటారు. అలాంటి సమయాన్ని ఈ సూపర్ ఫుడ్స్ బిడ్డకు తినిపిస్తే బిడ్డ బరువు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పుడ్స్ ఏంటో చూద్దాం.

అరటిపండు:

అరటిపండులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. ఇది శిశువు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీన్ని మెత్తగా చేసి పాలలో కలిపి బిడ్డకు సులభంగా తినిపించవచ్చు.

మొక్కజొన్న:

ఇంట్లోనే పప్పులు, తృణధాన్యాలు తయారు చేసి పిల్లలకు తినిపించండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. శిశువు బరువు కూడా పెరుగుతుంది.జొన్న ఖిచ్డీ తరుచుగా బిడ్డకు తినిపిస్తుండాలి. ఇందులో ప్రోటీన్, అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. తేలికగా జీర్ణమవుతుంది.

పండ్లను మెత్తగా చేసి:

మెత్తని పండ్లను పిల్లలకు తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు, యాపిల్, బొప్పాయి, మామిడికాయలను గుజ్జు చేయవచ్చు. పురీగా తినిపించండి. ఈ పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యానికి, పెరుగుదలకు చాలా మేలు చేస్తాయి. పిల్లలు సులభంగా జీర్ణం చేసుకుంటారు.

ఇడ్లీలో కూరగాయలను జోడించి:

సాధారణంగా పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు. ఇడ్లీలో కూరగాయలు వేసి బిడ్డకు తినిపిస్తే మేలు జరుగుతుంది. మీరు ఇడ్లీ పిండిలో క్యారెట్, పాలకూర లేదా ఏదైనా ఇతర కూరగాయలను కలపవచ్చు. ఇది ఇడ్లీని పోషకమైనదిగా చేస్తుంది. పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇది తినడానికి రుచిగా ఉండటంతోపాటు సులభంగా జీర్ణమవుతుంది.

పాల ఉత్పత్తులు:

పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ మాత్రమే కాదు కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చితే బరువు పెరగడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎముకలను బలంగా మార్చే కాల్షియం కూడా పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది. మీ బిడ్డకు పాలు తాగడం ఇష్టం లేకుంటే వెన్న, నెయ్యి, పెరుగు, పనీర్ కూడా తినిపించవచ్చు.

చికెన్:

చికెన్ లో ప్రొటీన్ ఉంటుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రొటీన్ల సాయంతో కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. మీ బిడ్డ మాంసాహారం ఇష్టంగా తింటే వారానికి రెండు సార్లు చికెన్ తినిపించండి .చికెన్ సూప్ కూడా ఇవ్వొచ్చు. చికెన్ తోపాటు ఉడకపెట్టిన గుడ్డును కూడా చేర్చండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.


Show Full Article
Print Article
Next Story
More Stories