Facial with semen: వీర్యంతో ఫేషియల్ ..త్వరలోనే మనదేశంలోనూ అందుబాటులో

Facial with semen: వీర్యంతో ఫేషియల్ ..త్వరలోనే మనదేశంలోనూ అందుబాటులో
x
Highlights

Facial with semen: వీర్యంతో ఫేషియల్..చదవడానికి, వినడానికి కాస్త ఇబ్బంది ఉంది కదా. ఈ మధ్య ఓ టీవీ షోలో హాలీవుడ్ తారా నటి కిమ్ కర్దాషియాన్ తన చర్మ...

Facial with semen: వీర్యంతో ఫేషియల్..చదవడానికి, వినడానికి కాస్త ఇబ్బంది ఉంది కదా. ఈ మధ్య ఓ టీవీ షోలో హాలీవుడ్ తారా నటి కిమ్ కర్దాషియాన్ తన చర్మ సౌందర్య రహస్యం ఏంటో చెప్పింది. తన చర్మం అంత అందంగా ఉండానికి తాను స్పెర్మ్ ఫేషియల్ చేయించుకుంటానని చెప్పుకొచ్చింది. ఆ అమ్మడు మాటలు విన్నవారంత నోరెళ్లబెట్టారు.

అయితే ఈ స్మెర్మ్ ఎక్కడి నుంచి తీసుకువస్తారనేది చాలా మంది డౌట్. అయితే దీనిని ప్రత్యేకంగా పెంచిన సాల్మన్ చేపల నుంచి నుంచి సేకరిస్తారట. వాటి వీర్యంతోనే అందులోంచి సేకరించిన డీఎన్ఏతోనూ రకరకాల సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా మార్చడానికి పలు రసాయనాలతో చేసే బొటాక్స్ ఇంజక్షన్లను వాడుతుంటారు. అయితే ఈ స్మెర్మ్ ఫేషియల్స్ ఫిల్లర్స్ ఇప్పుడు బొటాక్స్ కు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయట. మనదేశంలోనూ త్వరలోనే అందుబాటులోకి రానుందట. ఈ స్పెర్మ్ ధరరూ.50వేలకు పైగానే ఉంటుందట.

సాల్మన్ స్పెర్మ్ ఫేషియల్‌లో పాలీడియోక్సిరిబోన్యూక్లియోటైడ్స్ (PDRN) అని పిలిచే ఓ పదార్థంతో దీన్ని తయారు చేస్తారు. ఇది సాల్మన్ లేదా ట్రౌట్ చుమ్ స్పెర్మ్ కణాల నుండి తీసుకుంటారు. ఈ పదార్ధం దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. సాల్మన్ స్పెర్మ్ ఫేషియల్స్ ప్రయోజనాల గురించి అనేక అధ్యయనాలు జరిపారు. 2021లో ఫార్మాస్యూటికల్స్‌లో ప్రచురించిన పరిశోధన PDRN గాయం మానడంతోపాటు.. మానవ చర్మంలో మంటను తగ్గిస్తుందని సూచించింది. స్మెర్మ్ తో ఫేషియల్ దక్షిణ కొరియాలో చాలా ప్రాచుర్యంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories