Heat Stroke: మార్చి మొదలైంది.. హీట్‌ స్ట్రోక్స్‌తో చాలా ప్రమాదం.. ఒక్కోసారి మరణమే..!

Extreme Risk of Heat Stroke in March 2022 risk of Sudden Death | Summer Health Care Tips
x

Heat Stroke: మార్చి మొదలైంది.. హీట్‌ స్ట్రోక్స్‌తో చాలా ప్రమాదం.. ఒక్కోసారి మరణమే..!

Highlights

Heat Stroke: ప్రస్తుతం మార్చి నెల కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తున్నట్లు సమాచారం...

Heat Stroke: ప్రస్తుతం మార్చి నెల కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తున్నట్లు సమాచారం. మార్చి, మే-జూన్‌లలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలో ఏసీలు, కూలర్లు నడుస్తూనే ఉంటాయి. అలాగే హీట్ వేవ్ ప్రమాదం కూడా ఉంటుంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం మైదానాలలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు, కొండ ప్రాంతాలలో 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు వేడి తరంగాలు మొదలవుతాయి.

ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే అది ప్రమాదకరమైన హీట్ వేవ్‌గా చెబుతారు. తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 ° Cకి చేరుకున్నప్పుడు వేడి తరంగాలు ఏర్పడుతాయి. వైద్యుల ప్రకారం ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్ అంటే 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉన్నప్పుడు హీట్‌స్ట్రోక్ వస్తుంది. ఈ పరిస్థితిలో అధిక ఉష్ణోగ్రత, తేమ కారణంగా మన శరీరం చల్లగా ఉండదు. దీనినే హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ స్ట్రోక్ కారణంగా ఒక వ్యక్తి హృదయ స్పందన పెరుగుతుంది.

ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. తల తిరుగుతుంది. వాంతులు మొదలవుతాయి. కండరాల తిమ్మిరి వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. తీవ్ర గందరగోళంలో ఉంటాడు. వేడి మరింత ఎక్కువైతే పూర్తిగా స్పృహ కోల్పోవచ్చు. హీట్ స్ట్రోక్‌తో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేయకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. హీట్‌స్ట్రోక్‌ ఏ వయసు వారికైనా రావచ్చు. అయితే ఇది ఎక్కువగా వృద్ధులను ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది.

వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరాన్ని చల్లబరచుకునే సామర్థ్యం తగ్గిపోవడమే దీనికి కారణం. హీట్‌స్ట్రోక్‌ను నివారించడానికి క్రమం తప్పకుండా నీరు తాగాలి. చక్కెర పానీయాలు-మద్యం తాగకూడదు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. పగటిపూట వేడిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయవద్దు. చల్లని ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నించండి. తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఫ్యాన్ ముందు కూర్చోవాలి. మీ మెడ, చంక లేదా తలపై చల్లని నీటి గుడ్డ ఉంచాలి. ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది చాలా వరకు వేడి నుంచి రక్షిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories