Health Tips: పదే పదే దాహం వేస్తోందా.. జాగ్రత్త ఈ వ్యాధి కావొచ్చు..!

Excessive thirst can cause these diseases
x

Health Tips: పదే పదే దాహం వేస్తోందా.. జాగ్రత్త ఈ వ్యాధి కావొచ్చు..!

Highlights

Health Tips: పదే పదే దాహం వేస్తోందా.. జాగ్రత్త ఈ వ్యాధి కావొచ్చు..!

Health Tips: నీరు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. శరీరంలో దాదాపు 65 నుంచి 70 శాతం వరకు నీరే ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తారు. ఎప్పుడైతే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుందో అప్పుడు మెదడు నీటిని తాగమని సంకేతం ఇస్తుంది. దీనిని దాహం అంటారు. దాహం అనేది సాధారణ శరీర ప్రక్రియ. కానీ కొంతమందికి అకస్మాత్తుగా విపరీతమైన దాహం వేస్తుంది. ఇలాంటి సమస్య ఉంటే అస్సలు విస్మరించవద్దు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యాధులకి సంకేతం అవుతుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం.

1. మధుమేహం

మధుమేహం అనేది ఏ వయసు వారికైనా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుంది. అయితే సాధారణంగా చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఏర్పడుతుంది. డయాబెటిస్‌ వ్యాధిలో రక్తంలో చక్కెర మొత్తం పెరుగుతుంది. దీనిని మూత్రపిండాలు సులభంగా ఫిల్టర్ చేయలేకపోతుంది. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దాహం మళ్లీ మళ్లీ వేస్తుంది. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

2. అజీర్ణం

మనం తరచుగా పెళ్లిళ్లలో, పార్టీలలో లేదా ఇంట్లో అతిగా మసాలాతో కూడిన ఆహారాన్ని తింటాము. ఇది సులభంగా జీర్ణం కాదు. ఈ సంక్లిష్టమైన ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఆపై సాధారణం కంటే ఎక్కువ దాహం వేస్తుంది.

3. మానసిక పరిస్థితి

చాలా సార్లు మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు అధికంగా దాహం వేస్తుంది. దీని కారణంగా భయాందోళన, అశాంతిని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితిలో నోరు ఎండిపోతుంది. ఆ వ్యక్తి ఎక్కువ నీరు త్రాగాలి.

4. విపరీతమైన చెమట

వేసవి కాలంలో ఎక్కువగా చెమటలు పట్టడం సర్వసాధారణం. కానీ చలికాలంలో లేదా సాధారణ వాతావరణంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెమట పడితే అది అనేక వ్యాధులకు సంకేతం. దీని కారణంగా మీకు మరింత దాహం వేస్తుంది. ఇలాంటి సందర్భంలో వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories