Health Tips: నాన్‌వెజ్‌ తినకపోయినా విటమిన్‌ ఎ లభిస్తుంది.. కంటి చూపు అస్సలు తగ్గదు..!

Even if you Dont Eat Nonveg you can get Vitamin A If These are in the Diet
x

Health Tips: నాన్‌వెజ్‌ తినకపోయినా విటమిన్‌ ఎ లభిస్తుంది.. కంటి చూపు అస్సలు తగ్గదు..!

Highlights

Health Tips: విటమిన్ ఎ చాలా ముఖ్యమైన పోషకం.

Health Tips: విటమిన్ ఎ చాలా ముఖ్యమైన పోషకం. ఇది కంటి చూపు, కణ విభజన, శరీర పెరుగుదల, రోగనిరోధక శక్తి, పునరుత్పత్తిలో సహాయపడుతుంది. విటమిన్ ఎలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి మీ కణాలను రక్షిస్తాయి. విటమిన్ ఎ కొవ్వులో కరిగే విటమిన్. ఇది రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. గుడ్లు, సీఫుడ్ తినడం ద్వారా శరీరానికి విటమిన్ ఎ లభిస్తుంది. అయిత శాఖాహారం ద్వారా కూడా విటమిన్‌ ఎ లభిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

క్యారెట్

క్యారెట్‌లో బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్. కాబట్టి క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఒక మధ్య తరహా పచ్చి క్యారెట్‌లో 10190 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ ఎ ఉంటుంది. ఇది సగటు రోజువారీ అవసరానికి రెండు రెట్లు ఎక్కువ.

చిలగడదుంపలు

చిలగడదుంపలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ రుచి, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి విటమిన్ ఎ ఉత్తమ వనరులలో ఒకటి. ఇది రోజువారీ అవసరాలలో 400% కంటే ఎక్కువ. ప్రజలు దీన్ని పాలలో కలుపుకుని తినడానికి ఇష్టపడతారు.

టొమాటోలు

టొమాటోలు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ల గొప్ప వనరులలో ఒకటి. ఒక మీడియం సైజు టొమాటో శరీరానికి రోజువారీ విటమిన్ ఎ అవసరంలో 20 శాతాన్ని అందిస్తుంది. ఇది కాకుండా టమోటాలలో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి.

బఠానీలు

బఠానీలని చాలా మంది ఇష్టపడతారు. ఇవి శీతాకాలంలో లభిస్తాయి. అయితే ఇవి ఎండిన రూపంలో ఏడాది పొడవునా లభిస్తాయి. మీరు 100 గ్రాముల బఠానీలను తింటే శరీరానికి 765 అంతర్జాతీయ యూనిట్ల విటమిన్ ఎ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories