Health Tips: చలికాలం పొగమంచు వల్ల ఊపిరితిత్తులపై ఎఫెక్ట్‌.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Effect of Winter Fog on Lungs Take These Precautions
x

Health Tips: చలికాలం పొగమంచు వల్ల ఊపిరితిత్తులపై ఎఫెక్ట్‌.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Highlights

Health Tips: శీతాకాలం కొనసాగుతోంది. ఈ కాలంలో ఏర్పడే పొగమంచు వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడుతాయి.

Health Tips: శీతాకాలం కొనసాగుతోంది. ఈ కాలంలో ఏర్పడే పొగమంచు వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడుతాయి. ఉష్ణోగ్రత పడిపోతున్న సమయంలో పొగమంచు అధికంగా ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరం. శీతాకాలపు పొగమంచు నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

మార్నింగ్ వాక్ మానుకోండి

మీరు ఉదయం మార్నింగ్ వాక్ కి వెళ్లే అలవాటు ఉంటే మానుకోండి. కాదంటే ఈవినింగ్ వాక్ చేస్తే మంచిది. లేదా ఇంటి లోపల వ్యాయామం చేయండి. ఎందుకంటే ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

మాస్క్ వాడండి

పొగమంచులో బయటకు వెళ్లే ముందు మాస్క్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే మాస్క్ వల్ల నేరుగా కాలుష్యం బారిన పడకుండా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా మాస్క్‌ ధరించండి.

హైడ్రేటెడ్ గా ఉండండి

మీరు చలికాలంలో తక్కువ నీరు తాగుతుంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. దీని కోసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగండి.

కారు గ్లాస్ మూసేయండి

మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే కారు గ్లాస్ మూసి ఉంచడం అవసరం. ఇలా చేయడం వల్ల శీతాకాలపు పొగమంచుని నివారించవచ్చు.

మొక్కలను నాటండి

శీతాకాలపు పొగమంచు మిమ్మల్ని బాధించకూడదని కోరుకుంటే కాలుష్యం నుంచి మనలను రక్షించగల మొక్కలను నాటండి. దీని కోసం తులసి, కలబంద మొదలైన వాటిని నాటవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories