Fatty Liver: ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల మెదడుపై ఎఫెక్ట్‌.. వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..!

Effect of Fatty Liver Disease on the Brain Know the Symptoms of the Disease
x

Fatty Liver: ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల మెదడుపై ఎఫెక్ట్‌.. వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..!

Highlights

Fatty Liver: ఇటీవల జరిగిన అధ్యయనంలో ఫ్యాటీ లివర్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మెదడు సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తేలింది.

Fatty Liver: ఇటీవల జరిగిన అధ్యయనంలో ఫ్యాటీ లివర్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మెదడు సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. ఇటువంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల లివర్ ఫ్యాట్, మెదడుకు సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో నిపుణులు అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వ్యక్తులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని తేల్చారు.

పేలవమైన రెగ్యులర్ డైట్ వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదం పెరుగుతుంది. ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం పెరిగినప్పుడు అది క్రమంగా స్థూలకాయానికి దారితీస్తుంది. నియంత్రణ లేని ఊబకాయం మెదడు సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, ఆకలి లేకపోవడం, ఆకస్మిక బరువు నష్టం, ఉబ్బిన పొత్తికడుపు, కాళ్ళు, విపరీతమైన అలసట, బలహీనత, చర్మం రంగులో మార్పు వంటివి ఫ్యాటీ లివర్ లక్షణాలుగా చెప్పవచ్చు.

శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే రోగాలకి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా బయటి జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం మానేయాలి. వీలైనంత వరకు ఇంటి ఆహారాలు తినడమే మేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories