Health Tips: ఈ ఆహారాల కలయిక ఆరోగ్యానికి మంచిది..అవేంటంటే..?

Eating these foods together has amazing benefits
x

Health Tips: ఈ ఆహారాల కలయిక ఆరోగ్యానికి మంచిది..అవేంటంటే..?

Highlights

Health Tips: ఈ ఆహారాల కలయిక ఆరోగ్యానికి మంచిది..అవేంటంటే..?

Health Tips: ప్రతి ఆహారం ఎంతో కొంత పోషక విలువలని కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయి. సాధారణంగా శరీరం గరిష్ట పోషకాలను పొందగల ఆహార కలయికపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అయితే ఎలాంటి ఆహారాలు మిక్స్‌ చేసి తినాలో తెలుసుకుందాం.

నల్ల మిరియాలు, పసుపు

భారతీయ మసాలా దినుసులలో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. నల్ల మిరియాలు, పసుపు వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటిని కలిపి తినడం వల్ల శరీరం యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పొందుతుంది. దీని కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి బయటపడుతాము.

వోట్స్,బెర్రీలు

వోట్స్, బెర్రీల కలయిక అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే వీటిని మిక్సీలో వేసుకుని తింటారు. ఓట్స్ ద్వారా శరీరానికి ఐరన్, విటమిన్ బి లభిస్తాయి. బెర్రీలు తినడం ద్వారా శరీరానికి ఫైబర్ లభిస్తుంది. ఈ పోషకాలన్నీ మేలు చేస్తాయి. దీని కారణంగా అనేక తీవ్రమైన వ్యాధులకు మూలమైన ఊబకాయం కంట్రోల్‌లో ఉంటుంది.

ఆలివ్ ఆయిల్, టొమాటో

టొమాటో చాలా సాధారణమైన కూరగాయ. దీనిని అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. ఈ సూపర్‌ఫుడ్‌లో లైకోపీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి మనలను రక్షిస్తుంది. టొమాటోలో పోషక విలువలు పెరగాలంటే ఆలివ్ నూనెలో ఉడికించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories