After Meals: భోజనం చేసాక ఇవి తినండి..పొట్టలో రాళ్లు అయినా సరే అరిగిపోవాల్సిందే

Eating these after meals will not cause gastric problems
x

After meals: భోజనం చేసాక ఇవి తినండి..పొట్టలో రాళ్లు అయినా సరే అరిగిపోవాల్సిందే

Highlights

After meals: చాలా మంది మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రిస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల పదార్థాలను తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.కొన్ని ఫుడ్స్ తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావు . అవేంటో తెలుసుకుందాం.

After meals: భోజనం చేసిన తర్వాత పొట్ట ఉబ్బినట్లు, అసౌకర్యంగా, కడుపు నొప్పి వంటి సమస్యలు కొందరిలో వస్తుంటాయి. ఇవి సాధారణమే అయినప్పటికీ వాటిని భరించడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ప్రతిసానీ మందులు, ఈనో, సిరప్స్ వేసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు ఏం తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అరిగిపోవాలటే జీర్ణక్రియ సవ్యంగా సాగాలంటే కొన్ని ఫుడ్స్ తినడం అలవాటు చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత వీటిని తింటే మీ పొట్టలో ఉన్న ఆహారాన్ని అరిగించేస్తుంది. జీర్ణ ఎంజైమ్స్, సమ్మేళనాలను విడుదలయ్యేలా చేసి జీవక్రియను మెరుగుపరిచేలా చేస్తాయి. ఆహార అణువులను విచ్చిన్నం చేయడంలో పోషకాలను శరీరం గ్రహించేలా చేయడంలో కొన్ని రకాల ఆహారాలు చాలా బెస్ట్ గా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం.

స్పైసీ ఫుడ్

నూనెతో తయారు చేసిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ తింటే పొట్టలో వికారంగా ఉంటుంది. ఒక్కోసారి పొట్టలో నొప్పి, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు చిన్న అల్లం ముక్క తింటే సరిపోతుంది. అల్లం కషాయం అయినా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి

బొప్పాయిలో జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తి చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పపైన్ అని సమ్మేళనం ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచంతోపాటు పేగుల ఆరోగ్యాన్నికాపాడుతుంది. తాజా బొప్పాయి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పొట్ట నిండుగా ఆహారాన్ని తిన్నాక ఇబ్బంది అనిపించినట్లయితే బొప్పాయి తినండి.

పైనాపిల్

పైనాపిల్ చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దాని వాసన తినాలన్న కోరికను పెంచుతుంది. భోజనం చేసిన తర్వాత పైనాపిల్ ముక్కను తింటే ఎంతో మంచిది. ఇందులోని బ్రోమెలైన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత పైనాపిల్ ముక్కలు తింటే శరీరం పోషకాల శోషణ కూడా మెరుగుపరుస్తుంది.

పెరుగు

భోజనం చేసిన తర్వాత చివరలో ఒక కప్పు పెరుగు తింటే పొట్ట సౌకర్యంగా ఉంటుంది. పెరుగులో ప్రోబయెటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి బ్యాక్టీరియాతో నిండిన పెరుగు బోజనం తర్వాత తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories