Health Tips: రోజు అన్నం తింటే ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. అవేంటంటే..?

Eating Rice Every Day Can Cause These 5 Types Of Diseases Know Them Completely
x

Health Tips: రోజు అన్నం తింటే ఈ వ్యాధుల ప్రమాదం ఎక్కువ.. అవేంటంటే..?

Highlights

Health Tips: దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. మూడు పూటల అన్నం మాత్రమే తినేవారు చాలామంది ఉన్నారు.

Health Tips: దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. మూడు పూటల అన్నం మాత్రమే తినేవారు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు అన్నం తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అన్నం మాత్రమే కాకుండా అల్పహారాలని కూడా బియ్యంతోనే తయారుచేస్తున్నారు. ఆలయాలలో దేవుడికి సమర్పించే నైవేద్యాలలో, పంచే ప్రసాదాలలో కూడా పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి బియ్యంతో చేసే పదార్ధాలే ఉంటున్నాయి. పాలిష్‌ చేసిన బియ్యంలో ఎటువంటి పోషకాలు ఉండవు. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ముడి బియ్యంలో పోషకాలు ఉంటాయి. కానీ వాటిని పాలిష్‌ చేయడం వల్ల అన్ని పోతాయి. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే మిగులుతాయి. కాబట్టి అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్ అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్‌లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉండవు. దీనివల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది.

వైట్ రైస్ జీర్ణం కావడం కష్టం. ఇది గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి కడుపు సమస్యలకు దారితీస్తుంది. అందుకే తెల్లని అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తినవచ్చు. లేదంటే తక్కువ మోతాదులో అన్నం, ఎక్కువగా కూరలు తీసుకోవాలి. వారంలో కనీసం మూడు సార్లు బియ్యంతో వండిన పదార్ధాలైన ఇడ్లీ, దోస స్థానంలో ఓట్స్, గోధుమ నూక, తృణ ధాన్యాలతో చేసిన అల్పహారాలు తినాలి. అన్నంలో అధిక స్థాయిలో పిండి పదార్థాలు, గ్లైసెమిక్ శాతం ఉండటంతో చక్కెర వ్యాధితో భాదపడుతున్న వారిని అన్నం తినొద్దని వైద్యులు సూచిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories