Ragi Ladoo: చలికాలంలో రాగిలడ్డు ప్రత్యేకత వేరు.. ఈ సమస్యలకి దివ్య ఔషధం..!

Eating Ragi Ladoo in Winter has Wonderful Benefits Back Pain and Bone Problems go Away
x

Ragi Ladoo: చలికాలంలో రాగిలడ్డు ప్రత్యేకత వేరు.. ఈ సమస్యలకి దివ్య ఔషధం..!

Highlights

Ragi Ladoo: చలికాలంలో రాగిలడ్డు ప్రత్యేకత వేరు.. ఈ సమస్యలకి దివ్య ఔషధం..!

Ragi Ladoo: చలికాలంలో చాలా రకాల వేడి ఆహారాలు తీసుకుంటారు. ఈ ఆహారాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పని చేస్తాయి. మీరు ఈ కాలంలో రాగి లడ్డూలను కూడా తినవచ్చు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి రుచికరమైనవి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కీళ్లనొప్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వెన్నునొప్పి, ఎముకలకు సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో రాగితో చేసిన లడ్డూలను తప్పకుండా తినాలి. వీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావాలసిన వస్తువులు

రాగుల పిండి - 1 కప్పు, పామ్ షుగర్ - అర కప్పు, తురిమిన కొబ్బరి - 1/4 కప్పు, యాలకుల పొడి - 1/4 tsp, నల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - అర కప్పు, వేరుశెనగ - 2 టేబుల్ స్పూన్లు,

ఎలా తయారు చేయాలి..?

1. గ్యాస్ మీద పాన్ పెట్టాలి. ఇప్పుడు కొబ్బరి, వేరుశెనగ, నువ్వులను విడివిడిగా చిన్న మంటపై వేయించాలి. వాటిని కాసేపు చల్లారనివ్వాలి.

2. తర్వాత ఒక చెంచా నెయ్యిలో బాదంపప్పులను వేయించాలి.

3. తర్వాత రాగి పిండిని 2 నుంచి 3 చెంచాల నెయ్యిలో సుమారు 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. అందులో అవసరాన్ని బట్టి ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు.

4. అందులో పంచదార, యాలకులు వేయాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి, బాదం, వేరుశెనగ, నువ్వులు వేయాలి.

5. తర్వాత చిన్న చిన్న లడ్డూలను చేయాలి.

రాగి లడ్డూ ప్రయోజనాలు

రాగుల్లో పీచు, కాల్షియం, ప్రొటీన్లు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తానికి లోటు ఉండదు. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. రాగుల్లో ఫైబర్ ఉంటుంది. దీనివల్ల చాలా సమయం కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగిలో పాలీఫెనాల్స్ ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories