Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటే గుండెపోటు రాదు..!

Eating pumpkin seeds does not cause heart attack | Heart Health Tips
x

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటే గుండెపోటు రాదు..!

Highlights

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి...

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. గుండెను సురక్షితంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు ప్రబావవంతంగా పనిచేస్తాయి. కాని ఇది కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు ఈ విత్తనాలను పారేస్తుంటే మాత్రం ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తాయని గుర్తుంచుకోండి. డయాబెటిక్ రోగులకు గుమ్మడికాయ గింజలు ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. ఇది కాకుండా ఈ విత్తనాలు అనేక ప్రధాన వ్యాధుల నుంచి కాపాడుతాయి. గుమ్మడికాయ ప్రయోజనాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు. ఇది మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సహజంగానే ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహ సమస్యను దూరం చేయడంలో గుమ్మడి గింజలు చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. నిజానికి యాంటీ డయాబెటిక్ లక్షణాలు గుమ్మడి గింజలలో కనిపిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

దీంతో పాటు స్పెర్మ్ కౌంట్ పెంచడంలో గుమ్మడి విత్తనాలు బాగా ఉపయోగపడుతాయి. మీకు స్పెర్మ్ కౌంట్ సమస్య ఉన్నట్లయితే ప్రతిరోజూ గుమ్మడికాయ గింజలను తీసుకోవాలి. ఇది మీకు సహాయం చేస్తుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల కండరాలు, ఎముకల నొప్పి, జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించేందుకు సహాయపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories