Eating Papaya: పరగడుపున బొప్పాయి తింటే ఈ ప్రయోజనాలు.. కానీ వీరు మాత్రం తినవద్దు..!

Eating Papaya On An Empty Stomach Gives These Benefits But Diabetic Patients Should Not Eat It
x

Eating Papaya: పరగడుపున బొప్పాయి తింటే ఈ ప్రయోజనాలు.. కానీ వీరు మాత్రం తినవద్దు..!

Highlights

Eating Papaya: బొప్పాయి దాదాపు అన్ని సీజన్‌లలో లభిస్తుంది.

Eating Papaya: బొప్పాయి దాదాపు అన్ని సీజన్‌లలో లభిస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే డాక్టర్లు దీనిని తినమని సూచిస్తారు. బొప్పాయి ఒక రుచికరమై న, ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, పాపైన్, ఫైబర్ వంటి మూలకాలు ఉంటాయి. బొప్పాయిని ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు, అయితే ఉదయం పరగడుపున తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఒక అధ్యయనం ప్రకారం బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో హెల్ప్‌ చేస్తుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయిని పరగడుపున తినడం వల్ల ఈ ఎంజైమ్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. డీ హైడ్రేషన్‌లో సహాయపడుతుంది

బొప్పాయి ఒక సహజమైన డిటాక్సిఫైయింగ్ ఏజెంట్. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడంలో సాయపడుతాయి. ఉదయం పరగడుపున బొప్పాయి తినడం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది మంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

3.రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. బొప్పాయిని పరగడుపున తినడం వల్ల విటమిన్ సి నేరుగా రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి శక్తిని అందిస్తుంది.

4. బరువు తగ్గిస్తుంది

బొప్పాయి తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీరు తక్కువ తినేలా చేస్తుంది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

5. చర్మానికి మేలు

బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. ఈ మూలకాలు చర్మ కణాలను పోషించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సాయపడుతాయి. అలాగే బొప్పాయిని పరగడుపున తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, ముడతలు తొలగిపోతాయి.

వీరు తినవద్దు

మీరు డయాబెటిక్ లేదా రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బొప్పాయిని పరగడుపున తినవద్దు. ఇది కాకుండా మీరు పపైన్‌ తినడం వల్ల అలెర్ కి గురైనట్లయితే దీనికి దూరంగా ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories