Health Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?

Eating Junk Food is not Good for Health it Causes Many Diseases
x

Health Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?

Highlights

Health Tips: మంచి ఆహారం మంచి ఆరోగ్య రహస్యం అని అందరికి తెలుసు. ఆహారం, పానీయం సరిగ్గా లేకపోతే మనం అనారోగ్యానికి గురవుతాము.

Health Tips: మంచి ఆహారం మంచి ఆరోగ్య రహస్యం అని అందరికి తెలుసు. ఆహారం, పానీయం సరిగ్గా లేకపోతే మనం అనారోగ్యానికి గురవుతాము. కానీ నేటి వేగవంతమైన జీవితం మనం తినే ఆహార పద్దుతులని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు బ్రెడ్ స్థానంలో పిజ్జా, పాల స్థానంలో శీతల పానీయాలు వచ్చాయి. ప్యాకేజ్డ్ వస్తువులకు అలవాటు పడటం వల్ల త్వరగా రోగాలకి గురవుతున్నాం. రోజుల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. జంక్‌ ఫుడ్‌ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మనకంటే ముందు తరం వారు మనకంటే బలంగా, ఆరోగ్యంగా ఉండటం మనం చాలాసార్లు గమనించవచ్చు. కానీ ఇప్పటి తరం వారు చిన్న వయసులోనే ఆసుపత్రులు, మందుల సాయంతో జీవితం కొనసాగిస్తున్నారు. చెడు ఆహారం, పానీయాల కారణంగానే ఇది జరుగుతోంది. బయటి ఆహారంలో అవసరమైన పోషకాలు ఉండవు. దీని వల్ల శరీరానికి పోషకాహారం లభించదు. దీంతో బలహీనత వస్తుంది ఈ కారణంగా ప్రజలు చిన్న వయస్సులోనే అలసటకి గురవుతున్నారు.

ప్యాకెట్‌లోని వస్తువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇలా నిల్వ ఉండటానికి హాని కలిగించే అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. చాలా వస్తువులలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. చిప్స్, కుకీలు, క్రిస్ప్స్ వంటి ప్యాక్ చేసిన వస్తువులలో కార్బోహైడ్రేట్లు పెద్ద పరిమాణంలో కనిపిస్తాయి. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. నూడుల్స్, వంటి చైనీస్ వంటకాల్లో మైదా ఉంటుంది. ఇది పేగులని దెబ్బతీస్తుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. బర్గర్ పిజ్జాలు అధిక కేలరీల ఆహారం. ఇందులో మైదాను ఉపయోగిస్తారు. కాబట్టి వాటిని నివారించాలి. సాస్ ఈ రోజుల్లో ప్రతి వంటకంలో ఉపయోగిస్తున్నారు. కానీ అవి చాలా త్వరగా కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories