Health Tips: ఇత్తడి,రాగి పాత్రల్లో తింటే ఈ వ్యాధులు దూరం..!

Eating food in brass copper vessels can cure asthma and many other diseases
x

Health Tips: ఇత్తడి,రాగి పాత్రల్లో తింటే ఈ వ్యాధులు దూరం..!

Highlights

Health Tips: ఇత్తడి,రాగి పాత్రల్లో తింటే ఈ వ్యాధులు దూరం..!

Health Tips: మంచి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆహారాన్ని ఏ లోహపు పాత్రలో తింటారనేది చాలా ముఖ్యం. దేశంలో దాదాపు అన్ని కిచెన్‌లలో స్టీల్, అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్, ఇనుప పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పూర్వం గ్రామాల్లో ప్రజలు ఇనుము లేదా మట్టి కుండలలో ఆహారాన్ని వండేవారు. అయితే ఇత్తడి, రాగి పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

1. చాలా మంది ప్రజలు స్టీలు పాత్రలలో ఆహారాన్ని వండుతారు. దీని వల్ల ఆహారం త్వరగా ఉడుకుంతుంది. అయితే స్టీలు పాత్రల్లో ఆహారాన్ని వండితే 60 నుంచి 70 శాతం మాత్రమే పోషకాలు ఆదా అవుతాయి. క్రోమియం లేదా నికెల్‌తో పాలిష్ చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను కొనడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

2. వండడానికి, తినడానికి ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే ఆహారంలోని 90 శాతం పోషకాలు భద్రంగా ఉంటాయి. అయితే సిట్రిక్‌ ఆహారాలని ఇత్తడి పాత్రలలో వండకూడదని గుర్తుంచుకోండి. అవి ఆరోగ్యానికి హానికరం.

3. రాగి పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆస్తమా రోగుల సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో జింక్‌ పరిమాణం పెరిగి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో పాటు శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది.

4. ఆహారాన్ని ఇత్తడి, రాగి పాత్రల్లో ఉంచడం వల్ల ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories