Health Tips: ఈ గింజలు తింటే చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది.. గుండెపోటు ప్రమాదం తక్కువ..!

Eating Fenugreek Seeds Every day Reduces Bad Cholesterol and Reduces the Risk of Heart Attack
x

Health Tips: ఈ గింజలు తింటే చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది.. గుండెపోటు ప్రమాదం తక్కువ..!

Highlights

Health Tips: రక్తనాళాల్లో కొలస్ట్రాల్‌ పెరగడం చాలా ప్రాణాంతకం.

Health Tips: రక్తనాళాల్లో కొలస్ట్రాల్‌ పెరగడం చాలా ప్రాణాంతకం. ఎందుకంటే దీనివల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, ట్రిపుల్ నాళాల వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాంటి సమయంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు మెంతి గింజలను తినమని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రక్త నాళాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

మెంతిగింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లభిస్తాయి. అలాగే శరీరానికి ఫైబర్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం అందుతాయి. శరీరంలో అదనపు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. ప్రేగులలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. మెంతి గింజలలో కనిపించే స్టెరాయిడల్ సపోనిన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ గింజలు సిరల్లో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

కాలేయంలో ఉండే ఎల్‌డిఎల్ గ్రాహకాలను పెంచడంలో అలాగే లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడంలో మెంతి గింజలు సహాయపడతాయని అనేక పరిశోధనలలో తేలింది. మెంతి గింజల అధిక ప్రయోజనాన్ని పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీళ్లు తాగి గింజలను నమిలి తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories