Health Tips: గుడ్డులోని పచ్చసొన తినడం లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే..!

Eating Egg Yolks or Cant Get the Benefit of B Vitamins
x

Health Tips: గుడ్డులోని పచ్చసొన తినడం లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే..!

Highlights

Health Tips: గుడ్డులోని పచ్చసొన తినడంలో ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉన్నాయి.

Health Tips: గుడ్డులోని పచ్చసొన తినడంలో ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఇది మంచిదే అంటే మరికొందరు ఇది కొవ్వుపదార్థమని చెబుతారు. అందుకే చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొన మాత్రమే తిని పచ్చసొన వదిలివేస్తారు. అయితే శరీరంలో అదనపు కొవ్వుని నివారించడానికి ఇలా చేసినప్పటికీ ఇది మీకు ఎటువంటి హాని కలిగించదు. గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తినడం వల్ల A, D, E, K విటమిన్ల నుంచి వచ్చే 6 రకాల B విటమిన్ల ప్రయోజనాన్ని పొందలేరు. పచ్చసొన తినకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

పోషకాల లోపం

గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది చికెన్, చేపలు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో కనిపిస్తుంది. పూర్తిగా ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చసొనలో ఐరన్, జింక్ ఉంటాయి. మీరు దీనిని తినకపోతే ఈ పోషకాలు కోల్పోతారు.

రోగనిరోధక శక్తి కోల్పోవడం

గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ మినరల్స్, అమినో యాసిడ్స్, విటమిన్ డి, బి12 ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లు తినడం వల్ల శక్ పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. కళ్లను సురక్షితంగా ఉంచడమే కాకుండా చర్మం, జుట్టుకి కూడా మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్ కంటెంట్

కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న చాలా మంది వ్యక్తులు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకుండా వదిలేస్తారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాదాపు ఒక గుడ్డులో 187 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఇది మీరు రెగ్యూలర్‌గా తీసుకునే మటన్‌, ఐస్‌ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే తక్కువే. ఇలాంటి పరిస్థితులలో గుడ్డులోని పసుపుభాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories