Health Tips: ఎండాకాలం పెరుగు తింటే చలువ చేస్తుంది.. కానీ వీటితో కలిపి తినవద్దు..!

Eating Curd During Summer Will Make you Feel Cold but do not eat it With These Foods
x

Health Tips: ఎండాకాలం పెరుగు తింటే చలువ చేస్తుంది.. కానీ వీటితో కలిపి తినవద్దు..!

Highlights

Health Tips: వేసవిలో పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాడీలోని వేడిని తీసేసి చలువ చేస్తుంది.

Health Tips: వేసవిలో పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాడీలోని వేడిని తీసేసి చలువ చేస్తుంది. పెరుగును అనేక విధాలుగా తీసుకోవచ్చు. మజ్జిగ, లస్సీ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. పెరుగులో మంచి బాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. అయితే కొన్ని ఆహారాలతో పెరుగును ఎప్పుడు కలిపి తినవద్దు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

మామిడి పండు తిన్న తర్వాత పెరుగు తినవద్దు

ఎండాకాలం మామిడిపండ్లు ఎక్కువగా లభిస్తాయి. అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత వెంటనే పెరుగు అన్నం కానీ లస్సీ కానీ మజ్జిగ కానీ తాగవద్దు. దీనివల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటి కలయిక మంచిది కాదు.

పాలు తాగిన వెంటనే పెరుగు తినవద్దు

పాలు, పెరుగు సరైన కాంబినేషన్‌ కాదు. ఈ రెండింటిని కలపి తీసుకోవడం వల్ల అసిడిటీ, ఉబ్బరం, గుండెల్లో మంటకు దారితీస్తుంది. విరేచనాలు ఎదురవుతాయి. పాలు భారంగా ఉంటాయి కడుపు నిండినట్లు అవుతుంది. పెరుగు తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల కలిపి తీసుకోవద్దు.

పెరుగు, ఆయిల్ ఫుడ్స్

పెరుగుతో పాటు నెయ్యి, నూనెతో కూడిన ఆహారాలు తీసుకోవద్దు. ఇవన్నీ పరస్పరం విరుద్ధమైన ఆహారాలు. పెరుగుతో పాటు ఆయిల్ ఫుడ్స్‌ను తీసుకున్నప్పుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నిద్రమత్తు ఎక్కువ ఉంటుంది.

చేపలు, పెరుగు కలిపి తినవద్దు

మాంసాహారంలో పెరుగు కలిపి వండుతారు. కానీ చేపలకు మాత్రం ఇది వర్తించదు. సీఫుడ్స్‌తో పెరుగును కలపకూడదు. దీనివల్ల ఫుడ్‌ పాయిజన్‌ అవుతుంది.

పెరుగు, ఉల్లిపాయ కలిపి తినకూడదు

గ్రామాల్లో పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. దీనివల్ల అలెర్జీలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ, వాంతులు కలుగుతాయి. కారణం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఉల్లిపాయ దీనికి విరుద్ధంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories