Health Tips: రోజుకో టమోటా తినండి..ఈ బెనిఫిట్స్ అన్నీ మీ సొంతం..!

Eat Tomato Daily All These Benefits Are Yours
x

Health Tips: రోజుకో టమోటా తినండి..ఈ బెనిఫిట్స్ అన్నీ మీ సొంతం..

Highlights

Health Tips: టమోటా.. ఈ కూరగాయ గురించి తెలియని వారు ఉండరు. ఇది లేనిదే ఏ వంటను కూడా వండలేము.

Health Tips: టమోటా.. ఈ కూరగాయ గురించి తెలియని వారు ఉండరు. ఇది లేనిదే ఏ వంటను కూడా వండలేము. టమోటాను కేవలం కూరలోకి మాత్రమే వేస్తారు అనుకుంటే పొరపాటే.. టమోటాతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్. టమోటాను మన రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందగలం. ఇందులో పీచు పదార్థం, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కే, ఫోలెట్, బీటా కెరోటీన్, క్యాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారుచేసిన వంటకాలను తింటే మంచి ఫలితాలను అందుకోగలరు.

టమోటాల్లో సిట్రిక్ అనే ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ నుంచి విముక్తి కలుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. టమోటాతో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వలన ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడేందుకు సహాయపడుతుంది. అలాగే బరువును నియంత్రిచే విషయంలో కూడా టమోటాలు అద్భుతంగా పని చేస్తాయి. కంటి జబ్బులకు టామోటాల్లో ఉన్న విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూర‌ల్లో విరివిగా వాడే ట‌మోటా ఓ పోషకాల గని. వండినదే కాక.. పచ్చిగా సలాడ్ల రూపంలో తినడానికి కూడా అనువైనది.

గుండెపోటును చెక్ పెట్టాల‌న్నా..టమాటా తినాల్సిందే. ఎందుకంటే? ట‌మాటాపై ఉండే ఎరుపు రంగు పొర‌ల్లో లైకోపిన్ ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే రోజుకు 25 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ లైకోపిన్ ఉండే ఆహారం అంటే ట‌మోటాను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను ప‌ది శాతం వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా..రోజుకు అర‌లీట‌రు టమాటా జ్యూస్ తాగితే..లేదా 50 గ్రాముల ట‌మోటా గుజ్జు తీసుకున్నా గుండె జ‌బ్బుల‌కు గుడ్‌ బై చెప్పేయొచ్చు. అలాగే ఊపిరితిత్తులు, స్టొమక్‌, ప్రోస్టేట్ క్యాన్స‌ర్ల‌ను నియంత్రించ‌వ‌చ్చున‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌తిరోజూ ఆహారంలో ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో ప్రోస్టేట్ కేన్స‌ర్‌ను దూరం చేసుకోవ‌చ్చున‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వారానికి దాదాపు ఒకటిన్న‌ర కిలోల ట‌మాటాల‌ను ఆహారంలో తీసుకునే పురుషుల్లో ప్రోస్టేట్ కేన్స‌ర్ సోకే అవ‌కాశాలు చాలా త‌క్కువ అని బ్రిటీష్‌లో నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. పురుషుల్లో ఏర్ప‌డే రెండోవ అతిపెద్ద వ్యాధి ప్రోస్టేట్ కేన్స‌ర్‌. టామాటాలు ఈ కేన్స‌ర్ కార‌క క‌ణాల‌ను నిర్మూలిస్తాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

టమోటాకు ఎవరు దూరంగా ఉండాలి:

టమోటా ఆమ్ల గుణం కలిగి ఉండుట వలన టమోటా తిన్నప్పుడు అధిక గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దాని కారణంగా గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు టమోటా చాలా తక్కువగా తినాలి. అలాగే టమోటాలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉండుట వలన చర్మం పై దద్దుర్లు లేదా అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అలెర్జీ ఉన్నవారు టమోటా తింటే నోరు, నాలుక మరియు ముఖం వాపు, తుమ్ములు, గొంతు ఇన్ఫెక్షన్, చర్మం పై తీవ్రమైన దురద, వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టమోటాలో పొటాషియం మరియు ఆక్సలేట్‌ ఎక్కువగా ఉండుట వలన కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా తక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల టమోటాలో 5 గ్రాముల ఆక్సలేట్ ఉంటుంది. అధిక బ‌రువు ఉన్న‌వారు, డ‌యాబెటిస్‌, హైబీపీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా ఆక్సలేట్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు చెబుతున్నారు. వారిలో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా టమోటాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే టమోటాలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్‌ ఉంటుంది. సోలనైన్ అనేది కణజాలంలో కాల్షియం పేరుకుపోవడానికి కారణం అవుతుంది. దాంతో టమోటా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు మరియు కండరాల నొప్పులు, వాపులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమైతే టమోటాను చాలా తక్కువగా తీసుకోవాలి….లేదంటే టమోటాకి దూరంగా ఉండటమే మంచిది. టమోటాలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.

Show Full Article
Print Article
Next Story
More Stories