Health Tips: కంటిచూపు కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Eat These Foods Daily to Protect Your Eyesight add Them to Your Diet Today
x

Health Tips: కంటిచూపు కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Highlights

Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారు.

Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ముఖ్యంగా కళ్లని అస్సలు పట్టించుకోవడం లేదు. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, అనారోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కంటి చూపు బలహీనపడుతోంది. దీంతో చాలామందికి కళ్లద్దాలు, లెన్స్‌ ఉపయోగించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కంటి చూపును పెంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఎర్ర మిరపకాయ

ఎర్ర మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల రక్తనాళాలకు మేలు చేస్తుంది. కంటిశుక్లం రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు, కాలీఫ్లవర్, బొప్పాయి మొదలైనవి వాటిలో కూడా విటమిన్‌ సి ఉంటుంది. మిరపకాయలో విటమిన్ ఎ, ఇ కూడా ఉంటాయి. ఇవి కళ్లకు చాలా మంచి చేస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలు, డ్రై ఫ్రూట్స్‌

పొద్దుతిరుగుడు విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిశుక్లం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. హాజెల్ నట్స్, వేరుశెనగ వంటి వాటిలో కూడా విటమిన్ E అధికంగా లభిస్తుంది.

ఆకు కూరలు

ఆకకూరలలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇందులో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కళ్లకు చాలా మేలు చేస్తాయి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆకుకూరలలో విటమిన్ ఎ కూడా లభిస్తుంది. ఇది కంటి చూపును పెంచడానికి పనిచేస్తుంది.

బీటా కెరోటిన్ ఫ్రూట్స్‌

బత్తాయి, క్యారెట్, పుచ్చకాయ, మామిడిర, నేరేడు పండు, ఆరెంజ్‌ మొదలైన వాటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. చూపు మెరగవడానికి ఇవి చాలా సహాయం చేస్తాయి.

బీన్స్, చిక్కుళ్ళు

బీన్స్, కాయధాన్యాలు మొదలైన వాటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇవి కంటి చూపు మెరుగపరచడానికి సహాయం చేస్తాయి. అందుకే ప్రతిరోజు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories