Healthy Kidney Foods: ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం ఇవి తినాలి.. సమస్యలన్ని దూరం..!

Eat these foods and Fruits for Healthy Kidneys all Kidney Problems will go away
x

Healthy Kidney Foods: ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం ఇవి తినాలి.. సమస్యలన్ని దూరం..!

Highlights

Healthy Kidney Foods: శరీరంలో కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. ఇవి బాడీలోని మలినాలని బయటికి పంపిస్తాయి. విసర్జన వ్యవస్థలాగా పనిచేస్తాయి.

Healthy Kidney Foods: శరీరంలో కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. ఇవి బాడీలోని మలినాలని బయటికి పంపిస్తాయి. విసర్జన వ్యవస్థలాగా పనిచేస్తాయి. కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే ఆరోగ్యం మొత్తం పాడవుతుంది. అందుకే కిడ్నీలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యని ఎదుర్కొంటున్నారు. వారు తినే తిండి, చెడు అలవాట్ల వల్ల ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కిడ్నీల ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

కాలీఫ్లవర్

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే కాలీఫ్లవర్‌ని తరచుగా తింటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే క్యాలీఫ్లవర్‌ని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

క్యాబేజీ

క్యాబేజీని తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే క్యాబేజీలో విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి ఉంటాయి. ఇవి మూత్రపిండాల వ్యాధులను నయం చేస్తాయి. అందుకే క్యాబేజీని డైట్‌లో చేర్చుకోవాలి.

ఆపిల్

రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయి. ఇందులో శరీరానికి మేలు చేసే విటమిన్లు, ఐరన్, కాల్షియం, జింక్ ఉంటాయి. కిడ్నీకి సంబంధించిన సమస్య ఉంటే ఆపిల్ తినవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీకి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.

ఎర్ర ద్రాక్ష

కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎర్ర ద్రాక్షను తినాలి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీకి సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతాయి. అందుకే ఎర్ర ద్రాక్షని డైట్‌లో చేర్చుకోవాలి.

సరిపడ నీరు

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. లేదంటే రాళ్లు తయారవుతాయి. కొంతమంది పని ఒత్తిడిలో పడి నీరు తాగడం మానుకుంటారు. మరికొంతమంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. ఇలా కాకుండా గంట గంటకి ఒక గ్లాసు మంచినీరు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అవి చేసే పనిని సమర్థవంతంగా చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories