Clove-Health: లవంగం... పవర్‌ఫుల్ మెడిసిన్..!

Eat One Clove A Day Get Rid Of These Health Problems
x

Clove-Health: లవంగం... పవర్‌ఫుల్ మెడిసిన్..!

Highlights

Clove Medicine: లవంగం ఈ పేరు వినబడగానే ఇంట్లోని పోపులపెట్టె గుర్తుకొస్తుంది.. మరికొంద రికి ఘాటైన కారం, వాసన గుర్తుకువస్తాయి.

Clove Medicine: లవంగం ఈ పేరు వినబడగానే ఇంట్లోని పోపులపెట్టె గుర్తుకొస్తుంది.. మరికొంద రికి ఘాటైన కారం, వాసన గుర్తుకువస్తాయి. దీనిని చాలామంది ఒక మసాల దినుసుగా మాత్రమే పరిగణిస్తారు. బిర్యానీలు, కూరల్లో టేస్ట్‌ కోసం మాత్రమే వాడుతారు. కానీ దీనికి మరో హిస్టరీ ఉంది. ఇది ఒక పవర్‌ఫుల్‌ మెడిసిన్‌ అని చాలామందికి తెలియదు. ఇందులోని పోషకాలు క్యాన్సర్‌, జీర్ణకోశ సమస్యలను నయం చేయగలవు. వీటిలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు సాయం చేస్తాయి. ఈ రోజు లవంగం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం లవంగం తింటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలు దూరమవుతాయి. లవంగం నూనె తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సమస్యలు నయమవుతాయి. లవంగాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన మనల్ని ఆరోగ్యంగా చేస్తాయి. లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అనేక పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

లవంగాల్లోని ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా ఆపుతుంది. అల్సర్‌తో బాధపడేవారు కూడా లవంగాలు తీసుకోవచ్చు. ఇవి కడుపు నొప్పి, వాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. లవంగాల్లో ఉన్న పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ త్వరగా బరువు తగ్గడానికి సాయం చేస్తాయి. వీటిల్లో ఉండే యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, విటమిన్స్ E, C, K, ఏలు జీవక్రియని పెంచి, కేలరీలను వేగంగా కరిగిస్తాయి. కానీ ఏదైనా అధికంగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే లవంగాలను మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు ఎదురవుతాయని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories