Health Tips: బరువు తగ్గడానికి జామపండు తినండి.. షాకింగ్‌ ప్రయోజనాలు..!

Eat Guava to Lose Weight Shocking Benefits
x

Health Tips: బరువు తగ్గడానికి జామపండు తినండి.. షాకింగ్‌ ప్రయోజనాలు..!

Highlights

Health Tips: సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Health Tips: సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజువారీ డైట్‌లో ఎప్పుడైనా పండ్లని చేర్చుకోవాలి. జామపండు ఈ సీజన్‌లో పుష్కలంగా దొరుకుతుంది. పచ్చి జామపండ్లను అందరూ ఇష్టపడతారు. అయితే జామపండ్లు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో శరీరానికి కూడా అంతే ఆరోగ్యకరం. జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

జామపండు తినడం వల్ల చలికాలంలో బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతే కాదు జామ ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే రోజూ ఉదయాన్నే జామపండును తీసుకుంటే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. జామకాయలో పొటాషియం, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ జామపండును తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే శీతాకాలంలో జామపండును ఖచ్చితంగా తినండి. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు దరిచేరవు. జామపండు తినడం వల్ల బరువు తగ్గుతారు. జామపండులో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు బరువును తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ జామపండు తినండి.

Show Full Article
Print Article
Next Story
More Stories