Osteoarthritis: మోకాళ్లలో నిరంతరం నొప్పా.? దేనికి సంకేతమో తెలుసా.?

Early Symptoms of Osteoarthritis and the Reason for This
x

మోకాళ్లలో నిరంతరం నొప్పా.? దేనికి సంకేతమో తెలుసా.?

Highlights

Osteoarthritis: మోకాళ్ల నొప్పులు ఇప్పుడు సర్వసాధారణమంగా మారిపోయాయి. ఒకప్పుడు 60 ఏళ్ల వారిలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 40 ఏళ్ల వారిలో కూడా కనిపిస్తుంది.

Osteoarthritis: మోకాళ్ల నొప్పులు ఇప్పుడు సర్వసాధారణమంగా మారిపోయాయి. ఒకప్పుడు 60 ఏళ్ల వారిలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 40 ఏళ్ల వారిలో కూడా కనిపిస్తుంది. మారిన జీవన విధానం , తీసుకుంటున్న ఆహారంలో మార్పులు , క్యాల్షియం లోపం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాల వల్ల మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. అయితే దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే మీరు ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడినట్లు అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఆస్టియో ఆర్థరైటిస్‌ అంటే ఏంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా శరీరంలో ఉండే ప్రతీ ఎముకల మధ్య మృదులాస్థి ఉంటుంది. వీటిలో తలెత్తే ఇబ్బందుల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌ వస్తే కూర్చొని లేవడానికి ఇబ్బందిగా మారుతుంది. మోకాళ్లలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దడం మొదలై, తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే కచ్చితంగా రోజు వ్యాయామం చేయాలి. అలాగే బరువును అదుపులో ఉంచుకోవాలి. మోకాళ్లకు అయ్యే గాయాలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు, వైద్యులను వెంటనే సంప్రదించాలి. మెత్తగా ఉండే చెప్పులను ధరించడం అలవాటు చేసుకోవాలి. ఇక నడిచే సమయంలో శరీరం సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్న వారు వెంటనే అలవాటును మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక తీసుకునే ఆహారంలో క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. పాల పదార్థాలతో పాటు, ఆకు కూరలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories