Health Tips: చెడు కొలస్ట్రాల్‌ ఈ వ్యాధులకి కారణం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!

Due to the Increase of Bad Cholesterol These Diseases are Surrounded
x

Health Tips: చెడు కొలస్ట్రాల్‌ ఈ వ్యాధులకి కారణం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!

Highlights

Health Tips: నేటి రోజుల్లో శరీరంలో కొలస్ట్రాల్‌పెరగడం అనేది అతిపెద్ద సమస్య. దీనివల్ల చాలామంది ఊబకాయానికి గురవుతున్నారు.

Health Tips: నేటి రోజుల్లో శరీరంలో కొలస్ట్రాల్‌పెరగడం అనేది అతిపెద్ద సమస్య. దీనివల్ల చాలామంది ఊబకాయానికి గురవుతున్నారు. అంతేకాదు అధిక కొలస్ట్రాల్‌ అనేక వ్యాధులకి కారణమవుతుంది. ఇది రక్తంలో కనిపించే ఒక మైనపు పదార్థం. వాస్తవానికి కొలస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఇందులో చెడు కొలస్ట్రాల్‌ చాలా ప్రమాదకరం. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. దీనివల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

గుండె జబ్బులు

శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ పెరగడం గుండెకి అస్సలు మంచిది కాదు. దీనివల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది ధమనుల గోడలలో నిక్షిప్తమవుతుంది. దీని వల్ల గుండెపోటు సంభవిస్తుంది.

స్ట్రోక్ ప్రమాదం

అధిక కొలెస్ట్రాల్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. చెడు కొలెస్ట్రాల్ గుండె మాత్రమే కాదు మెదడుకు వెళ్లే రక్త నాలలో పేరుకుపోతుంది. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు. దీంతో చాలామంది స్ట్రోక్‌కి గురవుతున్నారు. అందుకే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. ప్రతి మూడు నెలలకి ఒకసారి కొలస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

కిడ్నీ ఫెయిల్యూర్‌

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కిడ్నీలు కూడా ఫెయిల్‌ అవుతాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీకి నాళాలలో పేరుకుపోవడం మొదలవుతుంది. దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఎదురవుతాయి. అందుకే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం అవసరం.

అధిక బరువు, ఊబకాయం

శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరగడం వల్ల చాలామంది అధిక బరువు పెరుగుతున్నారు. దీంతో ఊబకాయం బారిన పడుతున్నారు. దీనివల్ల వారి బరువు వారే మోయలేకపోతున్నారు. దీంతో మోకాళ్ల నొప్పుల బారినపడుతున్నారు. కొలస్ట్రాల్‌ అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా వ్యాధులకి దూరంగా ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories