High BP: హైబీపీ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదం.. నిర్లక్ష్యం చేస్తే మరణమే..!

Due to High BP it Affects the Brain if Neglected it Leads to Death
x

High BP: హైబీపీ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదం.. నిర్లక్ష్యం చేస్తే మరణమే..!

Highlights

High BP: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి వల్ల చాలామంది రక్తపోటుకి గురవుతున్నారు.

High BP: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి వల్ల చాలామంది రక్తపోటుకి గురవుతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే అంత సులువుగా తగ్గదు. ముఖ్యంగా హై బీపీ చాలా ప్రమాదకరం. ఇది గుండెపై మాత్రమే కాకుండా మెదడుపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా యువత హై బీపీ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కిడ్నీ, మెదడుకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. అధిక రక్తపోటు మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

స్ట్రోక్ ప్రమాదం

హై బీపీ కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల శరీరంలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. మెదడు లోపల కూడా పగిలిపోతాయి. మాట్లాడటం కూడా ఉండదు. అందుకే హై బీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

జ్ఞాపకశక్తి తగ్గడం

హై బీపీ కారణంగా అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదం కూడా పెరిగింది. మెదడుపై దీని ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. హై బీపీ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే మతిమరుపు సమస్య సంభవిస్తుంది. అందుకే దీని విషయంలో అలర్ట్‌గా ఉండాలి.

ఆందోళన, టెన్షన్‌

హై బీపీ కారణంగా ఆందోళన, టెన్షన్‌ , ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయి. ఇలాంటి సమయంలో దీనిని నియంత్రించడం చాలా కష్టమవుతుంది. హై బీపీ రావడానికి ధూమపానం, మద్యపానం కూడా కారణమవుతాయి. అందుకే ఇలాంటి అలవాట్లని మానేస్తే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories