BP : బీపీ నార్మల్ అవ్వాలంటే ఈ రాతితో చేసిన గ్లాసులో నీరు తాగాలంటూ ప్రచారం..ఇందులో నిజమెంత?

BP : బీపీ నార్మల్ అవ్వాలంటే ఈ రాతితో చేసిన గ్లాసులో నీరు తాగాలంటూ ప్రచారం..ఇందులో నిజమెంత?
x

బీపీ నార్మల్ అవ్వాలంటే ఈ రాతితో చేసిన గ్లాసులో నీరు తాగాలంటూ ప్రచారం..ఇందులో నిజమెంత..?

Highlights

BP : నేటికాలంలో చాలా మంది అధిక బీపీతో బాధపడుతున్నాయి. అధిక బీపీ అనేది అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వంటి వ్యాధులు అధిక బీపీ కారణంగానే వస్తాయి. అయితే బీపీ నార్మల్ అవ్వాలంటే ఈ రాతితో చేసిన గ్లాసులో నీరు తాగాలంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.

BP : మినరల్ వాటర్..ఇప్పుడు ప్రతి ఒక్కరూ టిన్స్, వాటర్ బాటిల్స్ వాడుతూ ఎక్కువగా తాగుతున్నారు. ప్రయాణాల్లోనే కాకుండా..ఇంటికి కూడా ఆ వాటర్ సప్లయ్ ఉంటుంది. ఇంతకు ముందు ఊరంతటికీ ఓ వాటర్ ట్యాంక్ ఉండేది. లేదంటే బావుల్లో ఉండే నీటిని తోడుకుని తాగుతుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లేవు. అందుకే ట్యాప్స్ వచ్చాయి. పంపులు వస్తే ఆ నీళ్లనే తాగేవాళ్లం. కానీ ఇప్పుడు కల్చర్ తగ్గి కొత్తగా వచ్చిన మినరల్ వాటర్ తాగేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రతి ఒక్కరి ఇంట్లో మినరల్ వాటర్ ఉంటున్నాయి.

అయితే నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య రక్తపోటు. దీన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బీపీ నార్మల్ అవ్వాలంటే ఈ రాతితో తయారు చేసి గ్లాసులో నీరు తాగాలంటూ ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ప్రచారంలో నిజమేంత? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

శిలాజ రాయి అంటే ఏమిటి?

దీనిని ఫాసిల్ స్టోన్ లేదా హబ్బర్ స్టోన్ అంటారు.దీనిని హబురియా భాటా అని కూడా అంటారు. ఈ శిలలో మిలియన్ల సంవత్సరాల నాటి శిలాజాలు ఉన్నాయి.దీనిపై ఇంటర్నెట్‌లో సెర్చింగ్ కూడా జరిగింది. ఫాసిల్ స్టోన్, జైసల్మేర్ ఫాసిల్ స్టోన్ ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ రాయి హబర్‌లో కనుగొన్నారు. కాబట్టి దీనికి అదే పేరు పెట్టారు. జైసల్మేర్ నుండి హబర్ దాదాపు 50 కి.మీ.దూరంలో ఉంది. హబర్ రాయికి ఆదరణ పెరుగుతుండటంతో, చిన్న గ్రామానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ రాయిని కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు. ఈ రాయితోనే మినరల్ వాటర్ తయారు చేస్తున్నారు.

రాయితో రక్తపోటును నియంత్రించడం సాధ్యమేనా?

ఈ రాయిని కుండలో వేసి ఆ నీటిని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సరైన సాక్ష్యం లేదు. సహజ ఖనిజాలు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను నిర్వహించడం,రక్తనాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది. మెగ్నీషియం కండరాలు,నరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. కండరాల సంకోచానికి, గుండె కండరాలకు కూడా కాల్షియం అవసరం.

ఈ ఖనిజాలను కలిగి ఉన్న ఆహారాలలో ఆకుపచ్చ కూరగాయలు, అరటిపండ్లు, గింజలు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఆహారాలను సమతుల్య ఆహారంలో చేర్చినట్లయితే, అది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.రక్తపోటు ఉన్నవారికి సహజ ఖనిజ పదార్ధాలు సిఫార్సు చేస్తారు వైద్యులు. అధిక రక్తపోటు అనేది మల్టిఫ్యాక్టోరియల్ సమస్య కాబట్టి, దానిని నియంత్రించడానికి సహజ ఖనిజాలను మాత్రమే ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇక్కడి గ్రామస్తులు ఈ రాళ్లను వివిధ రకాలుగా వంటల్లో ఉపయోగిస్తున్నారు.ఈ రాళ్లతో చేసిన పాత్రలను పెరుగు చేయడానికి ఉపయోగిస్తారు. దీంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. రాతి పాత్రలో పాలు పోసి రాత్రంతా అలాగే ఉంచుతారు. ఈ రాయిలో ఉండే కొన్ని పదార్థాలు పాలతో మిక్స్ చేసి చాలా సహజమైన పద్ధతిలో పులియబెట్టి తాజా పెరుగును మట్టి రుచితో తయారు చేస్తాయి. ఈ టెక్నిక్ పురాతన కాలం నుండి ఆచరణలో ఉంది. ఇది పెరుగుకు ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. సహజ సిద్ధమైన ఈ పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories