Copper Vessel Water: రాగిపాత్రలో నీరు తాగుతున్నారా.. ప్రయోజనాలతో పాటు ఇది గమనించండి..!

Drinking Water in a Copper Vessel has Many Benefits and also keep this in mind
x

Copper Vessel Water: రాగిపాత్రలో నీరు తాగుతున్నారా.. ప్రయోజనాలతో పాటు ఇది గమనించండి..!

Highlights

Copper Vessel Water: ప్రాచీన కాలంలో నీరు తాగడానికి రాగిపాత్రలు, రాగి గ్లాసులని మాత్రమే ఉపయోగించేవారు.

Copper Vessel Water: ప్రాచీన కాలంలో నీరు తాగడానికి రాగిపాత్రలు, రాగి గ్లాసులని మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఆధునిక కాలంలో చాలామంది స్టీల్‌, ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారు. భారతీయ సంప్రదాయంలో రాగి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు దాని ట్రెండ్ కూడా తగ్గిపోయింది. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ రాగిపాత్రలని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రయోజనాలతో పాటు ఒక విషయాన్ని గమనించాలి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

రాగి పాత్రలో నీళ్లు తాగితే ఏమవుతుంది?

చాలా మంది ఆరోగ్య నిపుణులు నీటిని రాగి పాత్రలో నిల్వ చేసి తాగితే మంచిదని సూచిస్తారు. వాస్తవానికి రాగి ఒక ముఖ్యమైన పోషకం. ఇది శరీరానికి చాలా అవసరం. వివిధ రకాల శరీర విధుల్లో ఇది సహాయపడుతుంది. గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహకరిస్తుంది. రాగి పాత్రల్లో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ లోహపు పాత్రలో 48 గంటలకు పైగా నీటిని నిల్వ చేసి తాగితే శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రాగి గ్లాసులో నీరు తాగితే శరీరానికి చల్లదనం వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ లోహంలో ఉంచిన నీటిని తప్పనిసరిగా తాగాలి. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా రాగి పాత్రల నీటిని తాగవచ్చు. అయితే ఉదయం ఖాళీ కడుపుతో రాగి నీటిని తీసుకుంటే శరీరానికి గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. అయితే రాగి చాలా తక్కువ పరిమాణంలో శరీరానికి అవసరమని గుర్తుంచుకోండి. పదే పదే రాగి పాత్రలోని నీటిని తాగితే శరీరంలో రాగి పరిమాణం పెరిగి విషపూరితంగా మారుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఏర్పడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories