Tea Benfits: ఈ టీలు తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ..?

Tea Benfits: ఈ టీలు తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ..?
x

Drinking this tea is less likely to cause heart disease

Highlights

Tea Benfits: ఈ టీలు తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ..?

Tea Benfits: ఆంగ్లేయులు పోతూ పోతూ భారతదేశానికి టీని వదిలిపోయారు. దీంతో ఇది ప్రతి ఒక్కరికి నిత్యావసరంగా మారింది. రోజు ప్రారంభించాలంటే కచ్చితంగా టీ కావాల్సిందే, సమావేశమైనా, పెళ్లి అయినా మరేదైనా ఫంక్షన్‌ అయినా టీ తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఆధునిక కాలంలో చాలామంది టీకి అలవాటు అయ్యారు. రోజుకు కనీసి పది నుంచి పన్నెండు టీలు తాగేవారు ఉన్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటప్పుడు కొన్ని ప్రత్యేక టీ లు తీసుకుంటే మంచిది. ఎందుకంటే వీటికి గుండె జబ్బులు తగ్గించే శక్తి ఉంటుంది. అలాంటి టీల గురించి ఒక లుక్కేద్దాం.

1.గ్రీన్ టీ

గుండె నిపుణుల అభిప్రాయం ప్రకారం 3-4 కప్పుల గ్రీన్ టీని చక్కెర లేకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

2. బ్లాక్ టీ

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. రోజూ 2-3 కప్పుల బ్లాక్ టీ తాగేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. వారి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. అయినప్పటికీ అధిక రక్తపోటు లేదా వేగవంతమైన హృదయ స్పందన ఉన్న వ్యక్తులకు ఇది మంచిది కాదు.

3. ఊలాంగ్ టీ

ఊలాంగ్ టీని కామెల్లియా సినెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారుచేస్తారు. కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నవారికి ఇది మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ రోజువారీ ఆహారంలో ఊలాంగ్ టీని చేర్చే ముందు కార్డియాలజిస్ట్‌ను సంప్రదిస్తే మంచిది.

4. తెలుపు టీ

నిపుణుల అభిప్రాయం ప్రకారం వైట్ టీ గుండె ఆరోగ్యానికి మంచిది. వైట్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు ధమనులను విస్తరించడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories