Health Tips: ఈ హెర్బల్‌ టీతో థైరాయిడ్‌కి చెక్‌.. ఒత్తిడి, టెన్షన్‌ కూడా దూరం..!

Drinking This Herbal Tea Reduces the Risk of Thyroid Also Relieves Stress
x

Health Tips: ఈ హెర్బల్‌ టీతో థైరాయిడ్‌కి చెక్‌.. ఒత్తిడి, టెన్షన్‌ కూడా దూరం..!

Highlights

Health Tips: మనలో చాలామంది పాలు, చక్కెరతో తయారుచేసిన సాధారణ టీని తాగడానికి ఇష్టపడుతారు.

Health Tips: మనలో చాలామంది పాలు, చక్కెరతో తయారుచేసిన సాధారణ టీని తాగడానికి ఇష్టపడుతారు. కానీ వైద్య నిపుణులు ఇది ఆరోగ్యానికి మంచిదికాదని చెబుతారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. దీనికి బదులుగా హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. భారతదేశంలో సాధారణంగా కనిపించే మరో సమస్య థైరాయిడ్. ఇది మన శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇందులో సమస్య తలెత్తితే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. అయితే ఒక ప్రత్యేక టీ తాగడం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.

చామంతి టీ

చామంతి టీ గురించి మీరు సాధారణంగా విని ఉండరు. కానీ ఇది ఆరోగ్య పరంగా చాలా మంచిది. నిజానికి ఇందులో ఫ్లేవనాయిడ్స్ అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది చాలా మొక్కలలో కనిపించే పోషకాలలో ఒకటి. చామంతి టీలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. థైరాయిడ్ సమస్యని తగ్గించే ఔషధాలు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో జుట్టు రాలడం మొదలవుతుంది. అయితే వారు చామంతి టీ తాగితే జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

చామంతి టీ తాగితే థైరాయిడ్ సమస్యలు పూర్తిగా ముగియకపోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా వారికి దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఈ హెర్బల్ టీ తాగడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే జుట్టు రాలడం, పల్చటి జుట్టు వంటి సమస్యలు దూరమవుతాయి. ఊబకాయంతో బాధపడేవారు ఈ స్పెషల్ టీని తప్పనిసరిగా తాగాలి. దీని వల్ల పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుంది. డయాబెటీస్ రోగులకు చామంతి టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని రుజువుచేశారు. ఇది తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతాయి. చామంతి టీలో టెన్షన్, స్ట్రెస్‌ని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు రిఫ్రెష్‌ అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories