Pomegranate Tea: అప్పుడప్పుడు దానిమ్మ టీ ఒంటికి మంచిది.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యౌషధం..!

Drinking Pomegranate tea Early in the Morning on an Empty Stomach can Solve Many Health Problems
x

Pomegranate Tea: అప్పుడప్పుడు దానిమ్మ టీ ఒంటికి మంచిది.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యౌషధం..!

Highlights

Pomegranate Tea: టీ స్టాల్‌కి వెళితే అక్కడ రకరకాల టీలు లభిస్తాయి. అయితే ఎప్పుడైనా దానిమ్మ టీ తాగారా.. ఇది అక్కడ లభిస్తుందో లేదో తెలియదు కానీ ఇంట్లో మాత్రం సులభంగా తయారు చేసుకోవచ్చు.

Pomegranate Tea: టీ స్టాల్‌కి వెళితే అక్కడ రకరకాల టీలు లభిస్తాయి. అయితే ఎప్పుడైనా దానిమ్మ టీ తాగారా.. ఇది అక్కడ లభిస్తుందో లేదో తెలియదు కానీ ఇంట్లో మాత్రం సులభంగా తయారు చేసుకోవచ్చు. దానిమ్మలో అద్భుత ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇదొక సూపర్‌ఫుడ్‌ ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే పరగడుపున దానిమ్మ టీ తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారికి దివ్య వౌషధంగా చెప్పవచ్చు. దానిమ్మ టీ ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

దానిమ్మ టీ తయారీ

ఒక చిన్న బౌల్‌లో దానిమ్మగింజలు తీసుకుని, పప్పు రుబ్బే కర్రతో గింజల నుంచి జ్యూస్‌ బయటకు వచ్చేలా క్రష్‌ చేయాలి. తరువాత పంచదార కలుపుకొని ఒక జార్‌లోకి తీసుకోవాలి. ఇది ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. టీ తయారుచేసుకోవాలనుకున్నప్పుడు ఒక కప్పులో ఒక స్పూన్‌ దానిమ్మగింజలు, కొద్దిగా సూప్‌ తీసుకోవాలి. అందులో వేడి నీళ్లను పోసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

డయాబెటిస్ కంట్రోల్‌

దానిమ్మ టీలో ఉండే ప్రత్యేక గుణాలు రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తాయి. అందుకే డయాబెటీస్‌ పేషంట్లు ప్రతిరోజు ఒక కప్పు దానిమ్మ టీ తాగాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

బరువు కంట్రోల్‌

దానిమ్మ టీని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

దానిమ్మ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పరగడుపున దానిమ్మ టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పని చేస్తుంది. తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

డిటాక్సిఫికేషన్

దానిమ్మ టీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని మురికిని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే దానిమ్మ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన మురికి సహజంగా బయటకి వెళ్లిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories