Cancer: మీకు టీ, కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే క్యాన్సర్ ముప్పు తప్పినట్లే

Cancer: మీకు టీ, కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే క్యాన్సర్ ముప్పు తప్పినట్లే
x
Highlights

Cancer: మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేవగానే టీ కానీ, కాఫీ కానీ తాగాల్సిందే. టీ తాగకుంటే ఆరోజు మొత్తం ఏదో కోల్పోయిన భావన...

Cancer: మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేవగానే టీ కానీ, కాఫీ కానీ తాగాల్సిందే. టీ తాగకుంటే ఆరోజు మొత్తం ఏదో కోల్పోయిన భావన ఉంటుంది. అయితే కొన్ని అధ్యయనాలు కాఫీ, టీ తాగితే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటుంటే తాజా అధ్యయనం మాత్రం క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వెల్లడించింది. టీ, కాఫీ తాగడం వల్ల తల, గొంతు, మెడ, నోటీ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తల, మెడ, క్యాన్సర్ ఏడో అతి సాధారణ క్యాన్సర్. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఈ క్యాన్సర్ బాధితులు భారీగా పెరుగుతున్నారు. కానీ కాఫీని సేవించని వారితో పోల్చినప్పుడు రోజుకు 4 కప్పులు కన్నా ఎక్కువ కెఫినేటెడ్ కాఫీని తాగేవారికి తల, మెడ, క్యాన్సర్ ముప్పు 17శాతం తక్కువ ఉంటుందని అధ్యయనం తెలిపింది.

నోరు, నాలుక వంటి భాగాలకు క్యాన్సర్ ముప్పు 30శాతం, గొంతు క్యాన్సర్ ముప్పు 22శాతం తగ్గుతుందని గొంతు క్రింది భాగంలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 41శాతం తగ్గుతుందని వెల్లడించింది. డీకెఫినేటెడ్ కాఫీ కూడా కొంత వరకు సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపింది. టీ తాగడం వల్ల గొంతు కింద భాగంలో క్యాన్సర్ ప్రమాదం 29శాతం వరకు తగ్గుతుంది. రోజు ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ టీ తాగితే తల, మెడ క్యాన్సర్ ముప్పు 9శాతం వరకు తగ్గుతుంది. గొంతు కింది భాగంలో క్యాన్సర్ ముప్పు 27శాతం వరకు తగ్గుతుంది. అయితే రోజుకు ఒకటి కన్నా ఎక్కువగా టీ తాగితే స్వరపేటి క్యాన్సర్ ముప్పు 38శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories