Health Tips: శరీరంలో రక్తం తక్కువ ఉంటే ఈ జ్యూస్‌లు తాగండి.. సమస్యకి పరిష్కారం లభిస్తుంది..!

Drink these Juices if Blood is Low in the Body the Problem Will Be Solved
x

Health Tips: శరీరంలో రక్తం తక్కువ ఉంటే ఈ జ్యూస్‌లు తాగండి.. సమస్యకి పరిష్కారం లభిస్తుంది..!

Highlights

Health Tips: శరీరంలో రక్తం చాలా ముఖ్యమైన భాగం. దాదాపు శరీర బరువులో 8 శాతం వరకు ఉంటుంది.

Health Tips: శరీరంలో రక్తం చాలా ముఖ్యమైన భాగం. దాదాపు శరీర బరువులో 8 శాతం వరకు ఉంటుంది. ఇది బాడీలో ఒక రవాణా వ్యవస్థలా పనిచేస్తుంది. శరీరంలో రక్తం లేనట్లయితే ఒక వ్యక్తి కొంతకాలం తర్వాత చనిపోతాడు. అంతేకాదు సరిపోను రక్తం లేకపోవడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. రక్తహీనత సమస్యని ఎలా దూరం చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

ఎండిన ప్లం జ్యూస్

సహజ పద్ధతిలో శరీరంలో రక్తాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఎండిన ప్లం జ్యూస్ తాగాలి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్త లోపం తీరుతుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఎండిన ప్లం జ్యూస్‌ తీసుకోవాలి.

గ్రీన్ జ్యూస్

గ్రీన్ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది పాలకూర, బీట్‌రూట్ వంటి కూరగాయలతో తయారు చేస్తారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజూ ఈ జ్యూస్‌ను తాగాలి. ఇందులో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని వేగంగా వృద్ధి చేస్తాయి.

దానిమ్మ, ఖర్జూర రసం

దానిమ్మ, ఖర్జూర జ్యూస్‌లు రక్త లోపాన్ని తీరుస్తాయి. ఎందుకంటే ఈ రెండింటిలో ఐరన్, విటమిన్ సి ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది.

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రోజు దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానిక మేలు జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం వంటివి శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories