Health Tips: మధుమేహం బాధిస్తోందా.. అయితే డైట్‌లో ఈ ఫ్రూట్ చేర్చాల్సిందే..!

Dragon Fruit Health Benefits for Diabetes Patients in Telugu | Health Care Tips
x

Health Tips: మధుమేహం బాధిస్తోందా.. అయితే డైట్‌లో ఈ ఫ్రూట్ చేర్చాల్సిందే..!

Highlights

Health Tips: డ్రాగన్ ఫ్రూట్ రుచితోపాటు ఆరోగ్యానికి నిధి లాంటిది. ఇది చాలా ఖరీదైన పండు...

Health Tips: డ్రాగన్ ఫ్రూట్ రుచితోపాటు ఆరోగ్యానికి నిధి లాంటిది. ఇది చాలా ఖరీదైన పండు. అన్నిచోట్లా సులభంగా లభించదు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, రిచ్ ఫైబర్ డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి. ఈ పండు మధుమేహం, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో లైకోపీన్, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కరోనా కాలంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ బాగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు..

1- డయాబెటిస్ నియంత్రణ- డ్రాగన్ ఫ్రూట్‌లో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫినోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే, డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చుకోవచ్చు.

2- గుండెకు మేలు చేస్తుంది- డ్రాగన్ ఫ్రూట్‌లో చిన్న నల్లటి గింజలు ఉంటాయి. ఈ గింజల్లో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇది మీ హృదయాన్ని ఆరోగ్యంగా, బలంగా చేస్తుంది.

3- రోగనిరోధక శక్తిని పెంచుతుంది- డ్రాగన్ ఫ్రూట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

4- కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది- డ్రాగన్ ఫ్రూట్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

5- జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది- డ్రాగన్ ఫ్రూట్ మీ ఉదర సమస్యలను దూరం చేస్తుంది. కడుపు, పేగుల్లో మంచి మైక్రోబయోమ్‌ను పెరుగుతుంది. దీని కారణంగా కడుపు, పేగులకు సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

6- ఎముకలను బలంగా చేస్తుంది- డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆర్థరైటిస్‌ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories