Green Dosa: పిల్లల కోసం వెరైటీగా ఈ గ్రీన్ దోశ..ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారు

Green Dosa: పిల్లల కోసం వెరైటీగా ఈ గ్రీన్ దోశ..ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారు
x
Highlights

Dosa Recipe: పిల్లలు పాలకూర తినేందుకు ఎక్కువగా ఇష్టం చూపించరు. అయితే పాలకూరలో ఉన్న పోషకాలు మరే ఇతర ఆకుకూరలోను ఉండవని మనందరికీ తెలిసిందే. పాలకూరలో...

Dosa Recipe: పిల్లలు పాలకూర తినేందుకు ఎక్కువగా ఇష్టం చూపించరు. అయితే పాలకూరలో ఉన్న పోషకాలు మరే ఇతర ఆకుకూరలోను ఉండవని మనందరికీ తెలిసిందే. పాలకూరలో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. మరి ఈ పాలకూరను పిల్లలు తినాలంటే దాన్ని దోసెల రూపంలో చేసి తినిపించినట్లైతే, చాలా రుచికరంగా ఉందని లాగించేస్తారు. పాలకూర దోసను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా పాలకూర దోశ తయారికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.

పాలకూర దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు :

గోధుమపిండి - 200 గ్రాములు

పాలకూర పేస్ట్- 50 గ్రాములు

బియ్యప్పిండి - 50 గ్రాములు

ఉప్మారవ్వ - 50 గ్రాములు

ఉల్లి తరుగు - పావు కప్పు

కొత్తిమీర తరుగు - రుచి కోసం

పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టీస్పూన్

అల్లం తరుగు - ఒక టీస్పూన్

జీలకర్ర - ఒక టీ స్పూన్

ఉప్పు - రుచికి తగినంత

నూనె - తగినంత

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, ఉల్లితరుగు, పాలకూర పేస్ట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం తరుగు, కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దోసెల పిండిని పులియ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పిండిని నేరుగా దోసెలు వేసుకోవచ్చు. ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ పిండితో మీరు దోశలు వేసుకొని తినడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది.

పిల్లల కోసం మీరు దోశలను నెయ్యితో కాల్చి సర్వ్ చేసినట్లయితే, దోశలు చాలా రుచికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ దోశలను మీరు టమాటా సాస్, కొబ్బరి చెట్టు, పల్లి చట్నీ తో నంచుకొని తినవచ్చు. ఈ పాలకూర దోస రోల్ రూపంలో పిల్లలకు సర్వ్ చేయడం ద్వారా వారు చాలా ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. పాలకూర దోశపై ఉప్మా వేసుకొని తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

అలాగే ఈ పిండిలో మీరు మరిన్ని కూరగాయ ముక్కలు కూడా కలుపుకోవచ్చు. తద్వారా ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పాలకూరలో ఉండే పోషకాలు పిల్లలకు పాలకూర దోసెల రూపంలో పుష్కలంగా లభిస్తాయి. పాలకూర దోసను మీరు చీజ్ ద్వారా కూడా సర్వ్ చేసుకుని తినవచ్చు. ఇది మరింత రుచికరంగా ఉంటుంది. అలాగే మీరు ఈ దోష మధ్యలో ఆలుగడ్డ కూర వేసుకొని తిన్నట్లయితే పాలకూర మసాలా దోశగా చేసుకొని తినవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories