Health Tips: జిమ్‌కి వెళ్లడం ఇష్టంలేదా.. ఈ 4 మార్గాల్లో ఫిట్‌నెస్‌ పెంచుకోండి..!

Dont Want to go to the Gym Increase Your Fitness in These 4 Ways
x

Health Tips: జిమ్‌కి వెళ్లడం ఇష్టంలేదా.. ఈ 4 మార్గాల్లో ఫిట్‌నెస్‌ పెంచుకోండి..!

Highlights

Health Tips: మీకు జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేదా.. ఉద్యోగం చేస్తున్నట్లయితే సమయం సరిపోవడం లేదా.. అయితే ఏం పర్వాలేదు.

Health Tips: మీకు జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేదా.. ఉద్యోగం చేస్తున్నట్లయితే సమయం సరిపోవడం లేదా.. అయితే ఏం పర్వాలేదు. జిమ్‌కి వెళ్లకుండానే ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేయవచ్చు. ఫిట్‌గా ఉండాలనుకునే వారికి నాలుగు సులువైన మార్గాలు ఉన్నాయి. ఫిట్‌గా ఉండాలంటే రోజులో కనీసం 10 వేల అడుగులు నడవాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక డేటా ప్రకారం వారానికి మూడు గంటల నడక మొత్తం శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI)తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం ఈ రోజు నుంచే నడక ప్రారంభించండి.

డ్యాన్స్

డ్యాన్స్ అనేది మిమ్మల్ని ఫిట్‌గా మార్చే ఒక కళ. బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి డ్యాన్స్ ఉత్తమమైన మార్గాలలో ఒకటి. 50 నిమిషాల పాటు డ్యాన్స్ చేయడం ద్వారా 500 కేలరీలు బర్న్ చేయవచ్చు. ఇది బరువు తగ్గడానికి గొప్ప మార్గం మాత్రమే కాదు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

మెట్లు ఎక్కడం

మెట్లు ఎక్కడం అనేది ఫిట్‌నెస్ స్థాయిని పెంచడానికి ఒక గొప్ప మార్గం. దీనివల్ల రక్తసరఫరా బాగా జరుగుతుంది. ఇది గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడంలో, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

ఆటలు ఆడటం

మీరు ఫిట్‌గా ఉండటానికి ఆటలు కూడా ఆడవచ్చు. స్విమ్మింగ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఫిట్‌నెస్‌ని పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా ఆడటం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories