Shopping Mistakes: షాపింగ్‌ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే మీ జేబు లూటీ..!

Dont Make These Mistakes While Shopping or Your Money will be Wasted
x

Shopping Mistakes: షాపింగ్‌ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే మీ జేబు లూటీ..!

Highlights

Shopping Mistakes: షాపింగ్‌ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

Shopping Mistakes: షాపింగ్‌ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే డబ్బులు తగినంతగా ఉంటే ఖర్చు చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ తక్కువ డబ్బుతో పొదుపుగా షాపింగ్ చేయడం కొంచెం కష్టమైన పనే. చాలా మంది షాపింగ్ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల వారి జేబు లూటీ అవుతుంది. నెల బడ్జెట్ పూర్తిగా చెడిపోతుంది. ఈ పరిస్థితిలో మీరు షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన షాపింగ్ చిట్కాల గురించి తెలుసుకుందాం.

హడావిడి వద్దు

హడావిడిగా షాపింగ్ చేయవద్దు. తీరికగా ఓపికగా షాపింగ్ చేస్తే ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే విషయాన్ని ఆలోచిస్తాం. ఇలా చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఇంట్లో లేని వస్తువులు ఇంట్లోకి వస్తాయి. అనవసరపు వస్తువుల నుంచి దూరంగా ఉంటాం.

లిస్ట్ తప్పనిసరి

షాపింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు మీ వద్ద వస్తువుల జాబితా ఉందా లేదా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఉన్నట్లుండి ఏ ఏ వస్తువులు కొనాలో గుర్తుకురాకపోవచ్చు. అంతేకాదు మీ దగ్గర కొనాల్సిన వస్తువుల లిస్టు ఉంటే అవి మాత్రమే కొంటారు. మిగతా వస్తువులని పట్టించుకోరు. దీనివల్ల మీకు సమయం, డబ్బు రెండు ఆదా అవుతాయి.

కొత్త వస్తువులు

కొంతమంది మార్కెట్‌లోకి ఏది కొత్తగా వస్తే దానిని కొంటారు. దాని అవసరం ఉందా లేదా అని పరిశీలించరు. ఇలాంటి అలవాటు వల్ల నెలవారీ బడ్జెట్‌ను పాడవుతుంది. మాల్స్‌లోని దుకాణదారులు కావాలని కస్టమర్లని అట్రాక్ట్‌ చేయడానికి కొన్ని వస్తువులని అలంకరిస్తారు. ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు. ఇప్పటికే నిర్ణయించిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. తద్వారా డబ్బు ఆదా చేయవచ్చు.

ఇంట్లో చెక్‌ చేయాలి

షాపింగ్ చేసే ముందు ఇంట్లో ఒకసారి చెక్ చేయాలి. ఫ్రిజ్, స్టోర్, డ్రాయర్, అల్మారా తనిఖీ చేయాలి. లేదంటే ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులను మళ్లీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల డబ్బు వృధా అవుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories