Diabetes: షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

Diabetes: షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి
x
Highlights

Diabetes: ప్రపంచవ్యాప్తంగా దయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Diabetes: ప్రపంచవ్యాప్తంగా దయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా దయాబెటిస్ సమస్య తీవ్రంగా మారుతోంది. ఒక్కసారి ఈ వ్యాధి ఉందని తెలిస్తే చాలు జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారం మొదలు, అన్ని రకాల రోజూవారీ అలవాట్లపై ప్రభావం చూపుతుంది.

ఒక్కప్పుడు ఎక్కువ వయసు ఉన్న వారిలో మాత్రమే షుగర్ వ్యాధి వచ్చేది కానీ ప్రస్తుతం పాతికేళ్ల వారిలో కూడా డయాబెటీస్ ఎక్కువవుతోంది. పూర్తి స్థాయిలో నివారణ లేని షుగర్ వ్యాధిని కొన్ని జాగ్రత్తల ద్వారా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం సంబంధిత మందులు ఉపయోగిస్తున్న వారు కొన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటీస్ నివారణకు మందులు ఉపయోగించే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. షుగర్ సంబంధిత మందులు వాడే వారు స్వీట్లు, కేకులు వంటి చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చక్కర ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మందుల ప్రభావం సరిగ్గా పని చేయదని చెబుతున్నారు. అలాగే మాంసాహారం, పాల ఉత్పత్తులను కూడా వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో అధికంగా ఉండే GI సూచిక ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

డయాబెటీస్ మందులు వాడే వారు ఎట్టి పరిస్థితుల్లో మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఆల్కహాల్ కారణమవుతుంది. వీటితో పాటు చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్ నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories