Toilet Seat: టాయిలెట్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? సమస్యలు తప్పవంటున్న నిపుణులు..!

Dont Do These Mistakes While Using Toilet Seat Experts Say
x

Toilet Seat: టాయిలెట్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? సమస్యలు తప్పవంటున్న నిపుణులు..!

Highlights

పొరపాటున కూడా టాయిలెట్ లో ఇలాంటి పొరపాటు చేయొద్దు.. నిపుణులు ఏమన్నారంటే ?

Toilet Seat Information: టాయిలెట్ విషయంలో కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి జపాన్‌కు చెందిన ప్రముఖ టాయిలెట్ తయారీదారు టోటో పబ్లిక్ సర్వీస్ ప్రకటన (PSA) విడుదల చేసింది. టాయిలెట్ పేపర్‌తో టాయిలెట్ సీట్లను తుడవడం మానుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. టాయిలెట్ పేపర్‌తో తుడిచిన తర్వాత తన కొత్త టోటో సీటుపై గీతలు పడ్డాయని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

ఈ విషయమై టోటో కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తమ "వాష్‌లెట్" బిడెట్ టాయిలెట్ సీటు ప్లాస్టిక్ రెసిన్‌తో తయారు చేశారని తెలిపింది. టాయిలెట్‌ పేపర్‌ లేదా కాటన్‌తో శుభ్రం చేసే సమయంలో టాయిలెట్ సీటుపై కనిపించని గీతలు ఏర్పడుతాయని, అలాగే దుమ్ము కారణంగా టాయిలెట్‌ సీటు రంగు మారుతుందని తెలిపారు. టాయిలెట్ సీట్లను తయారు చేసేందుకు వివిధ రకాల ప్లాస్టిక్ రెసిన్‌లు ఉపయోగిస్తారని టోటో తెలిపింది.

ప్రతీ తయారీదారుడు భద్రత, నాణ్యత, ధర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రెసిన్‌ను ఎంచుకుంటారని టోటో కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం తమ టాయిలెట్ సీట్ల తయారీలో ఎలాంటి మార్పులు చేసే ఆలోచన లేదని కంపెనీ తెలిపింది. ఇక టాయిలెట్‌ సీట్‌ను ఎలా శుభ్రం చేయాలన్న దానికి సంబంధించిన వివరాలను లైఫ్‌ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. వీరి ప్రకారం.. టాయిలెట్ సీట్‌ను శుభ్రం చేయడానికి తడి గుడ్డ లేదా డ్రై టాయిలెట్ పేపర్‌ వాడకూడదని చెబుతున్నారు.

డిటర్జెంట్‌లో ముంచిన గుడ్డతో శుభ్రం చేయాలని చెబుతున్నారు. మెటల్ స్క్రబ్బర్, నైలాన్ వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదని చెబుతున్నారు. వీటివల్ల టాయిలెట్‌ సీటు ఉపరితం దెబ్బతింటుందని చెబుతున్నారు. కేవలం టాయిలెట్‌ శుభ్రత విషయంలోనే కాకుండా టాయిలెట్‌ను ఉపయోగించే విధానంలో కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. టాయిలెట్‌పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు ఫోన్‌లతో కుస్తీ పడుతూ కూర్చోవడం మంచి అలవాటు కాదని అంటున్నారు. ఎక్కువసేపు టాయిలెట్‌ గదిలో కూర్చోవడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా సమస్య మాత్రమే కాకుండా గుండె సంబంధించి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories