Fish oil Capsules: ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ వేసుకుంటే..గుండె జబ్బులు వస్తాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Does Taking Fish Oil Capsules Cause Heart Disease?
x

ఫిష్ ఆయిల్ క్యాపుల్స్ వేసుకుంటే..గుండె జబ్బులు వస్తాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Highlights

Fish oil Capsules: ఒమేగా-3 కొవ్వు యాసిడ్స్ శరీరంలోని ఇతర ముఖ్యమైన పోషకాలను సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చాలా మంది ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ తీసుకుంటారు. ఫిష్ ఆయిల్ తో తయారు చేసే ఈ సప్లిమెంట్ క్యాప్సూల్స్ శరీరంలోని పోషకాల లోపాన్ని నివారిస్తాయని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ సప్లిమెంట్లు నిజంగా లాభాలను అందిస్తాయా..వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవా..అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

Fish oil Capsules: చేపల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే ఒమేగా -3 కొవ్వు యాసిడ్స్ అత్యంత కీలకమైనవి. ఇవి గుండె నుండి మెదడు వరకు అవయవానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు యాసిడ్స్ శరీరంలోని ఇతర ముఖ్యమైన పోషకాలను సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చాలా మంది ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ తీసుకుంటారు. ఫిష్ ఆయిల్ తో తయారు చేసే ఈ సప్లిమెంట్ క్యాప్సూల్స్ శరీరంలోని పోషకాల లోపాన్ని నివారిస్తాయని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ సప్లిమెంట్లు నిజంగా లాభాలను అందిస్తాయా..వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవా..అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

సాధారణంగా సాల్మన్, ట్రౌట్ వంటి కొవ్వు చేపల నుండి తీసుకున్న కొవ్వునుంచి ఈ క్యాప్సూల్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా గుండె జబ్బులు, హై బ్లడ్ ప్రెజర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఈ ఫిష్ క్యాప్సుల్స్ తీసుకుంటారు. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తులలో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని పలు రకాల అధ్యయనాలు చెబుతున్నాయి.

తాజాగా ఒక అధ్యయనంలో పిష్ ఆయిల్ సప్లిమెంట్లు, హార్ట్ స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయని పరిశోధకులు నివేదించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 40-69 సంవత్సరాల వయస్సు గల 415,737 మంది వ్యక్తుల నుండి ఆరోగ్య డేటా ఆధారంగా పరిశోధనలు జరిపారు. వీరిలో మూడవ వంతు మంది ఫిస్ ఆయిల్ క్యాప్సూల్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. అధ్యయనం ప్రారంభంలో గుండె సమస్యలు లేని వ్యక్తులలో, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5 శాతం పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే గుండె జబ్బులు ఉన్నవారు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవడం వలన గుండెపోటు ప్రమాదాన్ని 15% నుంచి 9% తగ్గించుకోవచ్చని కనుగొన్నారు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్‌లో రక్తం గడ్డకట్టే నిరోధక లక్షణాలు ఉంటాయి. అయితే ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇది అనుకోకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

గుండె జబ్బులను నివారించడానికి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ క్యాప్సూల్స్ తీసుకోవాలనుకుంటే, దాని గురించి ఖచ్చితంగా మీ వైద్యుని సలహా తీసుకోమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. సప్లిమెంట్ క్యాప్సుల్స్ బదులు చేపలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తినడం మంచిదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories