Eating Rice At Night: రాత్రిపూట అన్నం తింటే ఆరోగ్యం దెబ్బతింటుందా..!

Does Eating Rice at Night Harm Health Know the Fact
x

Eating Rice At Night: రాత్రిపూట అన్నం తింటే ఆరోగ్యం దెబ్బతింటుందా..!

Highlights

Eating Rice At Night: మన దేశంలో మూడు పూటల అన్నం తినేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది వండటం చాలా సులభం.

Eating Rice At Night: మన దేశంలో మూడు పూటల అన్నం తినేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది వండటం చాలా సులభం. అంతేకాకుండా మిగతావాటితో పోలిస్తే బియ్యం ధర కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే అన్నాన్ని అందరు ఇష్టపడుతారు. ఇందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం ఉంటాయి. ఇదిలావుండగా రాత్రిపూట అన్నం తింటే ఆరోగ్యం పాడవుతుందని కొందరు నమ్ముతారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కార్బోహైడ్రేట్లు

అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. దీని కారణంగా చాలామంది రోజంతా పనిచేస్తుంటారు. అందుకే కార్మికులు మూడు పూటలా అన్నమే తింటారు. అప్పుడే వారికి సరిపడ శక్తి లభిస్తుంది.

కడుపుకు మేలు

అన్నం కడుపుకు చాలా మేలు చేస్తుంది. ఉడకబెట్టిన అన్నం సులభంగా జీర్ణమవుతుంది. కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు.

జీర్ణవ్యవస్థకు మేలు

అన్నం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు చేరుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలలో ఉపయోగకరంగా ఉంటుంది.

రాత్రి అన్నం తింటే మంచిదేనా?

అన్నం తింటే ప్రయోజనాలు ఉన్నట్లే అప్రయోజనాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట అన్నం తినడం వల్ల కొంతమందికి మేలు జరిగితే మరికొంతమందికి హాని జరుగుతుంది. ముఖ్యంగా బరువును తగ్గించుకోవాలనుకుంటే రాత్రిపూట అన్నం తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్‌ వల్ల అధికంగా బరువు పెరుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories