Air Pollution Affect: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌ గుండెపై పడుతుందా.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Does Air Pollution Affect The Heart Shocking Truths Have Been Revealed In The Research
x

Air Pollution Affect: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌ గుండెపై పడుతుందా.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Highlights

Air Pollution Affect: శీతాకాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీని కారణంగా గాలి విషతుల్యమవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

Air Pollution Affect: శీతాకాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీని కారణంగా గాలి విషతుల్యమవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి. కానీ వారు తీసుకునే నిర్ణయాలు ఆచరణలో సాధ్యంకావడం లేదు. వాయుకాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరగడమే కాకుండా గుండెపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఈ రోజు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వాయు కాలుష్యంలో ప్రధాన భాగాలు PM 2.5, PM 10, ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఇటీవల ఒక అధ్యయనంలో WHO, CDC (USA) వాయు కాలుష్యం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని నిర్ధారణకు వచ్చాయి. ఇందులో పీఎం 2.5 స్థాయి దీనికి ప్రధాన కారణమని తేలింది. భారతదేశంలో PM 2.5 స్థాయి 100 నుంచి 500 మధ్య ఉంటుంది. అయితే PM 2.5 సగటు స్థాయి10 ఉండాలి. స్వచ్ఛమైన గాలి ప్రాథమిక హక్కులలో ఒకటి అయినప్పటికీ అది అందరికీ అందడం లేదు. ఈ పరిస్థితిలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

క్లాత్ మాస్క్ లేదా సర్జికల్ మాస్క్: ఇవి PM 2.5 నుంచి మనలను రక్షించవు కానీ 30-40% వరకు మనలను రక్షించగలవు.

N95 మాస్క్: N95 మాస్క్ మనల్ని PM 2.5 నుంచి దాదాపు 95% రక్షిస్తుంది. అయితే N95 మాస్క్‌ని దీర్ఘకాలికంగా ఉపయోగించడం ఇబ్బందిపెడుతుంది.

శ్వాసకోశ N99 మాస్క్: ఇది PM 2.5 నుంచి 99% మనలను రక్షిస్తుంది. N99 మాస్క్‌ని నిరంతరం ధరించడం ఆచరణాత్మకం కాదు ఎందుకంటే ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది.

హెప్పా ఫిల్టర్‌లు

చాలా పెద్ద హాస్పిటల్స్‌ ముఖ్యంగా క్రిటికల్ కేర్, ఆపరేషన్ థియేటర్ ప్రాంతాల్లో హెప్పా ఫిల్టర్‌లు ఉన్నాయి. ఇవి భవనంలోని గాలి నుంచి 99% PM 2.5ని తొలగిస్తాయి. ఈ రోజుల్లో అనేక కార్యాలయ భవనాలలో HEPA ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నాయి. తద్వారా ఇండోర్ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు.

చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్‌లు

అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో ఇంట్లోనే ఉండి ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం మేలు. విపరీతమైన కాలుష్యం ఉన్న రోజుల్లో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లడం మానుకోండి. ఈ రోజుల్లో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే N95 మాస్క్ ఉపయోగించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories