Health News: మీ పిల్లలు కార్టూన్లు అధికంగా చూస్తున్నారా.. గమనించండి లేదంటే నష్టపోతారు..!

Do Your Children Watch Cartoons too Much Take Care or Else They Will Lose
x

Health News: మీ పిల్లలు కార్టూన్లు అధికంగా చూస్తున్నారా.. గమనించండి లేదంటే నష్టపోతారు..!

Highlights

Health News: నేటి రోజుల్లో పిల్లలు కార్టూన్లు చూడటానికి బానిసలుగా మారిపోతున్నారు.

Health News: నేటి రోజుల్లో పిల్లలు కార్టూన్లు చూడటానికి బానిసలుగా మారిపోతున్నారు. 1990లలో టామ్ అండ్ జెర్రీ, ది జంగిల్ బుక్, టేల్‌స్పిన్, డోనాల్డ్ డక్, డక్ కార్టూన్, బ్యాట్ మ్యాన్ వంటి కార్టూన్‌లను ఇష్టపడేవారు. కానీ ఈ రోజుల్లో డోరేమాన్, షిన్-చాన్‌లపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటున్నారు. అయితే పిల్లలు కార్టూన్లు చూడటం సరైనదేనా అని తల్లిదండ్రులు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. కార్టూన్లు చూసే ట్రెండ్ ఎందుకు పెరిగింది. ఇవి పిల్లల మనసుపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపుతున్నాయో ఈ రోజు తెలుసుకుందాం.

గత కొన్ని దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ రోజుల్లో పిల్లలు కార్టూన్లు ఎక్కువగా చూస్తున్నారు. నిజానికి 90వ దశకంలో మీరు ఇలాంటి కార్యక్రమాలను కేవలం టెలివిజన్ ద్వారానే మాత్రమే చూసేవారు. అయితే ఈ రోజుల్లో టీవీతో పాటు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్‌లు, టాబ్లెట్‌లు వంటి అనేక గాడ్జెట్‌లు ఇంట్లో ఉంటున్నాయి. ఇందులో పిల్లలు ఇంటర్నెట్ ద్వారా కార్టూన్లను నిరంతరం చూస్తున్నారు.

సైకాలజిస్టుల ప్రకారం.. పిల్లల్లో కార్టూన్లు చూసే అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. దీంతో వారు ఆహారం కూడా సరిగ్గా తినలేకపోతున్నారు. చదువు, ఆటలపై దృష్టి సారించరు. ఎంతసేపు స్కీన్‌ముందు కూర్చొని ఆనందిస్తారు. ఇది వారి మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు వీటినుంచి వారి మనుసుని ఆటలపై, చదువుపై మళ్లించాలి. తినే సమయంలో, ఇతర పండుగల సమయంలో కుటుంబంతో గడపడానికి పిల్లలను ప్రేరేపించడం అవసరం.

కార్టూన్లు చూసే బదులు ఫిజికల్ సహా ఇతర కార్యకలాపాలకు వెళ్లమని పిల్లలను ప్రేరేపించాలి. అప్పుడు వారు అలసిపోయి కార్టూన్లు చూడాలనే ఆసక్తి తగ్గుతుంది. వారు స్కీన్‌ముందు తక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి. లేదంటే వారి కళ్లు పాడవుతాయి. కొంతమంది పిల్లలలకి చిన్న వయసులోనే అద్దాలు వస్తాయి. చాలా ఎక్కువ కార్టూన్‌లను చూడటం వారి మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వర్చువల్ ప్రపంచంలో జీవించడం అలవాటు చేసుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories