Health Tips: చికెన్‌ వండే ముందు కడుగుతున్నారా.. ఈ విషయం గమనించండి..!

Do you Wash the Chicken Before Cooking Note This Thing
x

Health Tips: చికెన్‌ వండే ముందు కడుగుతున్నారా.. ఈ విషయం గమనించండి..!

Highlights

Health Tips: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్‌ లేదా మటన్‌ ఉండాల్సిందే.

Health Tips: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్‌ లేదా మటన్‌ ఉండాల్సిందే. నాన్‌వెజ్‌ప్రియులకి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక కొందరైతే వారానికి రెండు నుంచి మూడుసార్లు చికెన్‌ తింటారు. వంటరూమ్ లో చికెన్ వాసన వచ్చిందంటే చాలు ఇక ఆగలేరు. అంతేకాదు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే చికెన్ తప్పకుండా వండాల్సిందే. అయితే చికెన్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు గమనించాల్సి ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

చాలామంది చికెన్‌త అనేక రకాల వంటలు చేస్తారు. అయితే షాప్ నుంచి చికెన్ తెచ్చుకున్నాక కడగాలా లేదా అనేది చాలా మందికి తెలియదు. కానీ పరిశోధకులు మాత్రం చికెన్ కడగడం వల్లా ఆహారం విషతుల్యం అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే చికెన్ కడిగేటప్పుడు మాంసం మీద ఉండే బాక్టీరియ చేతులకి అంటుకుంటుంది. ఇది కడుపులోకి చేరి అనేక సమస్యలని సృష్టిస్తుందిని బ్రిటన్ కు చెందిన ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ (FCA)చెబుతుంది.

పచ్చి కోడి మాంసం మీద సాల్మోనెల్లా, క్యాంపిలో బ్యాక్టీరియ ఉంటుంది. ట్యాప్‌ కింద చికెన్ కడగడం వల్ల ఆ బ్యాక్టీరియ వంట పాత్రలపై, దుస్తులపై పడుతుంది. దీనివల్ల డయేరియ, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు ఏర్పడుతాయి. ఈ బ్యాక్టీరియ వల్ల ప్రధానంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్లకు చాలా ప్రమాదం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన చికెన్ ను కడగకుండా సరిపోయే టెంపరేచర్ లో ఉడికించాలి. మాంసం పట్టుకున్న చేతులను సబ్బుతో లేదా వేడినీటితో శుభ్రం చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories