Health Tips: ఉప్పగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలనిపిస్తుందా.. నివారించడానికి ఈ మార్గం ఎంచుకోండి..!

Do You Want To Eat More Salty Foods Choose This Way To Avoid
x

Health Tips: ఉప్పగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలనిపిస్తుందా.. నివారించడానికి ఈ మార్గం ఎంచుకోండి..!

Highlights

Health Tips: శరీరానికి ఉప్పు అవసరం ఉంటుంది. కానీ ఎంత మోతాదు అవసరమో అంతే తీసుకోవాలి.

Health Tips: శరీరానికి ఉప్పు అవసరం ఉంటుంది. కానీ ఎంత మోతాదు అవసరమో అంతే తీసుకోవాలి. కానీ కొంతమంది తరచుగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను ఇష్టపడుతా రు. చిప్స్‌ లాంటి స్నాక్స్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. దీనివల్ల శరీరంలో ఉప్పుశాతం పెరిగి చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ తినడం వల్ల నీరసం, ఒత్తిడి, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటిని కంట్రోల్‌ చేయడానికి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

1. అరటి

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది సులభంగా లభించే పండు. దీనిని నిత్యం డైట్‌లో చేర్చుకోవాలి.

2. చిలగడదుంప

శీతాకాలంలో చిలగడదుంపలను సులభంగా పొందుతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉప్పు కోరికలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

3. బచ్చలికూర

బచ్చలికూరలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఫైబర్ వంటి ఇతర పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆకు కూరలలో ఒకటి. కాబట్టి దీనిని ప్రతిరోజు డైట్‌లో చేర్చుకోవాలి.

ఇతర మార్గాలు

ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తృణధాన్యాలు తీసుకోండి. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూసుకోండి.

ఒత్తిడిని కంట్రోల్‌ చేసుకోవడానికి ప్రతిరోజు యోగా చేయండి. ఆరోగ్యకరమైన నిద్ర విధానాన్ని పాటించండి. దీనివల్ల ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలనిపించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories