Back Pain: వెన్నునొప్పి వేధిస్తుందా.. అయితే శరీరంలో ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..!

Do You Suffer From Back Pain But Find Out That There is Vitamin D Deficiency in the Body
x

Back Pain: వెన్నునొప్పి వేధిస్తుందా.. అయితే శరీరంలో ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..!

Highlights

Back Pain: నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పితో చాలామంది బాధపడుతున్నారు.

Back Pain: నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పితో చాలామంది బాధపడుతున్నారు. రోజంతా కూర్చుని పనిచేసేవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. చాలా మంది దీనిని నివారించడానికి మందులు వాడుతారు. మరికొంతమంది చికిత్స కూడా చేయించుకుంటారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు శరీరంలో విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ సమస్య సంభవిస్తుంది. దీనిగురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఒక అధ్యయనంలో విటమిన్ డి లోపం వల్ల నడుము, వెన్ను నొప్పి వస్తుందని తేలింది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారిలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా పని చేస్తున్న సమయంలో వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది.

ఎలా గుర్తించాలి..?

వెన్నునొప్పి సమస్య ఉన్నవారు ఒకసారి శరీరంలో విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి. డి విటమిన్ తక్కువగా ఉంటే ఆహారంలో మార్పులు చేయాలి. మందులు లేదా విటమిన్ డి ఇంజెక్షన్ల తీసుకొని దీని లోపాన్ని భర్తీ చేయాలి. అంతేకాకుండా వెన్నునొప్పిని నివారించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం.

వెన్నునొప్పిని ఎలా నివారించాలి..?

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదయం పూట సూర్యకాంతి పొందాలి. గుడ్లు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్‌ డి లభిస్తుంది. ఒకవేళ ఈ విటమిన్‌ తక్కువగా ఉంటే వైద్యుల సలహాతో మందులు వాడాలి. వెన్నునొప్పిని నివారించడానికి సొంతంగా ఔషధాలు వాడకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories