Sudden Vomiting: అకస్మాత్తుగా వాంతులు అవుతున్నాయా.. టెన్షన్‌ వద్దు ఇలా చేయండి..!

Do You Suddenly Feel Vomiting While Travelling Follow These Home Remedies
x

Sudden Vomiting: అకస్మాత్తుగా వాంతులు అవుతున్నాయా.. టెన్షన్‌ వద్దు ఇలా చేయండి..!

Highlights

Sudden Vomiting: కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వాంతులు చేసుకుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణం కానీ బస్సు ప్రయాణం కానీ కొంతమందికి పడదు.

Sudden Vomiting: కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వాంతులు చేసుకుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణం కానీ బస్సు ప్రయాణం కానీ కొంతమందికి పడదు. దీనివల్ల ప్రయాణంలో చాలా బలహీనంగా తయారవుతారు. ప్రయాణాన్ని ఆస్వాదించలేరు. ఈ పరిస్థితిలో కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. ఏలకులు

మోషన్ సిక్‌నెస్, ఫుడ్ పాయిజనింగ్, జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల వాంతులు అవుతాయి.

ఇలాంటి సమయంలో పచ్చి ఏలకులు తీసుకోవడం వల్ల వికారం, వాంతుల వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. వీటిని ఏ విధంగానైనా తినవచ్చు.

2. నిమ్మకాయ

నిమ్మకాయ వాంతులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఈ సమస్యను నివారించడంలో బాగా పనిచేస్తుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు.

3. సోంపు

రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు బిల్లుతో పాటు సోంపు కూడా ఇస్తారు. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా పని చేస్తుంది. అలాగే వాంతిని నివారించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. . దీని రుచి వాంతులను ఆపే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీనిని అనేక విధాలుగా తినవచ్చు.

4. లవంగం

లవంగం ప్రతి ఇంట్లో దొరికే మసాల పదార్ధం. వాంతులు, వికారం తగ్గాలంటే లవంగం ఎంతో మేలు చేస్తుంది. లవంగాన్ని నోటిలో ఉంచుకుంటే వాంతులు ఆగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories