Health Tips: టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. ఈ వ్యాధులు ప్రమాదం..!

Do you Sit on the Toilet Seat for a Long Time But you Get Diseases
x

Health Tips: టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. ఈ వ్యాధులు ప్రమాదం..!

Highlights

Health Tips: టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. ఈ వ్యాధులు ప్రమాదం..!

Health Tips: నేటిరోజుల్లో చాలామంది టాయిలెట్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారు. టాయిలెట్‌ సీటుపై కూర్చొని మొబైల్ ఫోన్ చూడటం లేదా న్యూస్ పేపర్ చదువుతూ పొట్టను క్లీన్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ అలవాటు చాలా రోగాలకి కారణం అవుతుంది. డాక్టర్ల ప్రకారం టాయిలెట్ సీట్‌ మీద 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు. ఈ తప్పుడు అలవాటు వల్ల ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుందాం.

వైద్యుల ప్రకారం ప్రజలు టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చొవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల పైల్స్ వ్యాధి, నొప్పి, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొత్తికడుపు, నడుము దగ్గర ఉండే చర్మం వదులుగా మారుతుంది. దీని కారణంగా కాళ్ళు, తుంటి కండరాలు బలహీనపడుతాయి. ఈ స్థితిలో నడుము, మోకాళ్లలో నొప్పి వచ్చి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

టాయిలెట్ లోపల, వెలుపల చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. టాయిలెట్‌ క్లీన్‌ చేసినా ఈ బ్యాక్టీరియా అంత తేలికగా చనిపోదు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ లేదా వార్తాపత్రికతో టాయిలెట్‌కి వెళ్లినప్పుడు ఈ బ్యాక్టీరియా వాటితో తిరిగి ఇంట్లోకి వస్తుంది. ఈ పరిస్థితిలో అతడితో పాటు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. టాయిలెట్ సీటుపై 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కడుపు, ప్రేగు కదలికపై అంటే జీర్ణక్రియ సామర్థ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories